కొన్ని సినిమాల్లో నటించే నటీనటులు చేసే పాత్రలను అంత తేలికగా మనం మరచిపోలేము, కేవలం హీరోలు మరియు హీరోయిన్లు మాత్రమే కాదు, క్యారక్టర్ ఆర్టిస్టులు చేసే పాత్రలు కూడా జనాలను ఎంతో ప్రభావితం చేసాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన నటుడు నాగినీడు. తమిళం రెండు మూడు సినిమాలు చేసిన ఆయనలోని ప్రతిభ ని చూసి దర్శక ధీరుడు రాజమౌళి తన మర్యాద రామన్న సినిమాలో మెయిన్ విలన్ రోల్ ని ఆఫర్ చేసాడు.
ఈ చిత్రం లో నాగినీడు నటించలేదు, జీవించాడనే చెప్పాలి. రాజమౌళి ఆయనలోని టాలెంట్ మొత్తాన్ని పిండేసాడు. ఈ చిత్రానికి ముందు నాగినీడు చేసిన మూడు తమిళ చిత్రాల్లోనూ పాజిటివ్ క్యారెక్టర్స్, అంత పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి కూడా, ఈ చిత్రం లో అంత రౌద్రం గా నటించాడంటే శబాష్ అనే చెప్పాలి.
అయితే నాగినీడుకి సినిమాల మీద ఉన్న విపరీతమైన అభిమానం కారణం గా, తనకి నెలకి లక్ష రూపాయిల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడట. సినీ రంగం అనేది రంగుల ప్రపంచం, ఎప్పుడూ ఒకేలా ఉండదు అని తెలిసి కూడా ఆయన రంగం లోకి దూకేశాడట. కొన్ని సినిమాలకు ఆయన కేవలం వెయ్యి రూపాయిలు మాత్రమే తీసుకున్న రోజులు కూడా ఉన్నాయట.
లక్ష రూపాయిల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, ఇంత తక్కువ చిల్లర తీసుకోవడానికి కూడా సిద్దమయ్యాడంటే ఆయనకీ సినిమాలు అంటే ఎంత పిచ్చి అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే 2019 వరకు ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గానే గడిపేవాడు, కానీ 2020 నుండి ఈయనకి సినిమాల్లో అవకాశాలే రావడం లేదు, అందువల్ల ఆర్థికంగా కూడా ఈమధ్య బాగా చితికిపోయాడట, ఇది ఇండస్ట్రీ లో నడుస్తున్న టాక్. మరి నాగినీడు కి భవిష్యత్తులో అయినా పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది చూడాలి.