Kalki Movie : కల్కి లో ఉన్న ఈ బుడ్డోడు ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన వాడు అనే విషయం మీకు తెలుసా?

- Advertisement -

Kalki Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. మహానటి చిత్రం తర్వాత డైరెక్టర్ నాగ అశ్విన్ నుండి హాలీవుడ్ తరహా స్టాండర్డ్స్ తో సినిమాని ఎవరైనా ఊహించగలరా?, అది కూడా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్న సినిమాకి!..రెండవ సినిమాతో అంత పెద్ద బాధ్యత భుజాన వేసుకోవడమే కాకుండా , రాజమౌళి తర్వాత అంతటి స్థాయి తనకే ఉంది అని ఇండియన్ మూవీ లవర్స్ తో అనిపించుకోవడం సాధారణమైన విషయం కాదు.

Kalki 2898 AD (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఇప్పటికే రెండు రోజులకి కలిపి 300 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఎంతో మంది యువ హీరోలు, హీరోయిన్లు అతిధి పాత్రలను పోషించారు. వాళ్ళను కాసేపు పక్కన పెడితే బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ తో ఉండే ఒక్క చిన్న కుర్రాడిని మీరంతా గమనించే ఉంటారు.

- Advertisement -

Kalki 2898 AD Reportedly Clears Censor With U/A Certificate: Here's The Film's Runtime | Times Now

చురుకైన మాటలతో, చక్కగా నటించిన ఈ కుర్రాడు ఎవరబ్బా?, ఇంతకు ముందు ఎవరి సినిమాల్లోనూ చూడలేదే అని మీ అందరికీ సందేహం వచ్చి ఉండొచ్చు. కానీ ఆ బుడ్డోడు మరెవరో కాదు, నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనవడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతం లో కూడా రాజేంద్రప్రసాద్ మహానటి సినిమాలో తన మనవరాలు ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

 

సావిత్రి చిన్నతనం లో కనిపించే అమ్మాయి రాజేంద్ర ప్రసాద్ మనవరాలే. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా ఆయన మనవడే అట. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ నాగ అశ్విన్ అవ్వడం మరో విశేషం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారిపోయింది, ఈ కుర్రాడి కోసం మరింత సమాచారం తెలుసుకునేందుకు నెటిజెన్స్ గూగుల్ లో వెతుకుతున్నారు.

Kalki 2898 AD: Trailer, Story & Everything We Know

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here