Rahul Sipligunj : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరికి గాను ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ పాట కి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఇప్పుడు గ్లోబల్ వైడ్ వస్తున్న పేరు ప్రఖ్యాతలు మామూలివి కావు.ముఖ్యంగా ఈ పాట తెలుగు వెర్షన్ కి గాత్రం అందించిన రాహుల్ సింప్లి గంజ్ మరియు కాళ భైరవ కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

వీరిలో ముఖ్యంగా మనం రాహుల్ సిప్లిగంజ్ గురించి మాట్లాడుకోవాలి.పొట్టకూటి కోసం కటింగ్ షాప్ లో బార్బర్ గా పనిచేసే రాహుల్, ఆ తర్వాత యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ,అలా వచ్చిన పాపులారిటీ తో అడపాదడపా సినిమా అవకాశాలు సంపాదించి, ఆ తర్వాత మన బిగ్ బాస్ తెలుగు లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, టైటిల్ విన్నర్ గా నిలిచి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
అలా బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల రాహుల్ కి పేరు ప్రఖ్యాతలు బాగా వచ్చాయి.సినిమాల్లో అవకాశాలు కూడా బలంగానే వచ్చాయి,అలా డైరెక్టర్ రాజమౌళి రాహుల్ సిప్లిగంజ్ టాలెంట్ ని గుర్తించి #RRR లో ‘నాటు నాటు‘ పాట పాడే అవకాశం ఇచ్చాడు. విడుదలకు ముందే ఈ పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది.సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ సక్సెస్ లో 50 శాతం భాగం ‘నాటు నాటు’ పాటకి ఉంటుందని చెప్పొచ్చు.

ఇంత గొప్ప పాట లో ఒక భాగం అయ్యినందుకు రాహుల్ సిప్లిగంజ్ కి ఒక అదృష్టం లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఈ పాట పాడినందుకు గాను రాహుల్ సిప్లిగంజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం మూడు లక్షల రూపాయిలు మాత్రమేనట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. తీసుకుంది తక్కువే అయినా వంద సినిమాలకు పాటలు పాడే రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్నాడు. ఇక నుండి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.