Guess The Actress : నేడు ఇండస్ట్రీ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది నటీనటులు ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల ద్వారా పాపులారిటీ ని సంపాదించి ఆ తర్వాత పెద్ద స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.ముఖ్యంగా బుల్లితెర స్టార్స్ రష్మీ, అనసూయ , శ్రీముఖి వంటి టాప్ లీడింగ్ సెలబ్రిటీస్ అందరూ మొదట్లో చిన్న చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీ ని పలకరించిన వారే.అలాంటి వారిలో ఇప్పుడు భానుశ్రీ కూడా చేరింది.
బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన భానుశ్రీ ఇప్పుడు బుల్లితెర మీద టాప్ స్టార్స్ లో ఒకరిగా చలామణి అవుతుంది.అంతే కాదు పలు సినిమాల్లో మరియు సీరియల్స్ లో కూడా మంచి అవకాశాలు సంపాదించింది.రీసెంట్ గానే స్టార్ మా లో ప్రసారమయ్యే BB జోడి షో లో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఇది ఇలా ఉండగా అప్పట్లో ఈమె చేసిన చిన్న చిన్న పాత్రలు చాలామంది గుర్తించలేదు. పాపులర్ సినిమాలలో హీరోయిన్ గ్రూప్ లో సైడ్ డ్యాన్సర్ గా కూడా చాలా సినిమాల్లో నటించింది. అందులో మిర్చి సినిమా కూడా ఒక్కటి. ఈ సినిమాలో ‘డార్లింగే.. ఓసి నా డార్లింగే’ అంటూ సాగే పాట ఆరోజుల్లో ఒక ఊపు ఊపింది.ఈ పాటలో అనుష్క పక్కన సైడ్ డ్యాన్సర్స్ లో ఒకరిగా చేసిన భానుశ్రీ ని మనం క్రింది ఫోటో లో చూడవచ్చు.
అంటే ఇండస్ట్రీ లో ఇప్పుడు భాను శ్రీ ఉన్న స్థానానికి చేరుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అన్నమాట. అయితే ఇప్పటికీ కూడా ఆమె బుల్లితెర కి మాత్రమే పరిమితం అయ్యింది. బుల్లితెర మీద కూడా టాప్ లీడింగ్ సెలబ్రిటీ కాదు, నలుగురిలో ఒకరు. భవిష్యత్తులో అయినా ఆమె వేరే స్థాయికి చేరుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.