టాలివుడ్ లో Pavitra Naresh రిలేషన్షిప్ గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో ఏ రేంజులో వైరల్ అయిందో చూసాము.. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చలు నడిచాయి. అలాగే నాలుగు రోజుల ముందు విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయన భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. దానిగురించి ప్రెస్ మీట్ పెట్టి షాకింగ్ విషయాలను నరేష్ బయట పెట్టాడు..అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

ఛీ.. ఛీ.. డబ్బు పిచ్చితోనే ఇలా చేశారా.. బరితెగించారు అంటూ నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు.. అసలు ఇదంతా సినిమాకు క్రేజ్ ను తీసుకురావడనే చేశారనే మరో వైపు వార్తలు వినిపిస్తున్నాయి..విషయానికొస్తే.. పవిత్రతో కలిసి నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య బోల్డ్ సినిమాలు మొదలు పెట్టి దూకుడుగా డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు దీనికి దర్శకుడు ని తెలుస్తోంది. ఈ సినిమా కథ ప్రకారం…మొదటి పెళ్లి విఫలమైన ఓ జంట కలిసి సహజీవనం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కడమే అంటున్నారు. ఈ సినిమాకు నరేష్ నే నిర్మాత…
నరేష్ రియల్ లైఫ్ నే కథగా స్క్రీన్ పై సినిమాగా ఎమ్మెస్ రాజు తీస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఒక్కో వీడియో రిలీజ్ చేస్తూ డిఫరెంట్ ప్రమోషన్ చేస్తున్నాడు నరేష్. అందుతున్న సమాచారం మేరకు’సెకండ్ ఇన్నింగ్స్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో పవిత్రా నరేష్ మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయని, ఎమ్మెస్ రాజు ప్రీవీయస్ మూవీస్ లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న రొమాంటిక్ మోతాదు కూడా ఎక్కువగానే ఉండనుందని తెలుస్తుంది. ఇక నరేష్, పవిత్ర తమ పెళ్లి గురించి ప్రకటించిన రోజునే రమ్యా మీడియాతో మాట్లాడింది. వారి పెళ్లి జరగనివ్వనని తెలిపింది. నరేష్, పవిత్రల లిప్ లాక్‌పై కూడా స్పందించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు.. దీనిపై రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఏది ఏమైనా ఈ వార్త మరోసారి వైరల్ అవుతుంది…