Venkatesh Daggubati : సిల్వర్ స్క్రీన్ మీద బ్యూటిఫుల్ కపుల్స్, మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనిపించే జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జంటగా విక్టరీ వెంకటేష్, సౌందర్య జంట నిల్చింది. వీళ్లిద్దరు వెండితెర మీద కనిపిస్తే భార్య భర్తలు అంటే ఇలాగే ఉండాలి అని అనిపిస్తాది. వీళ్ళ కాంబినేషన్ ని చూసి అప్పట్లో వీళ్ళ మధ్య ప్రేమాయణం నడిచింది అంటూ రూమర్స్ కూడా వినిపించాయి.
కానీ వెంకటేష్ వెంటనే ఈ రూమర్స్ కి స్పందించి సౌందర్య నాకు చెల్లెలు లాంటిది అని క్లారిటీ కూడా ఇచ్చాడు. వీళ్ళ కాంబినేషన్ లో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘పవిత్ర బంధం’, ‘జయం మనదేరా’, ‘రాజా’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘దేవి పుత్రుడు’ మరియు ‘సూపర్ పోలీస్’ వంటి సినిమాలు వచ్చాయి. వీటిల్లో అధిక శాతం సూపర్ హిట్స్ అయ్యాయి.
అయితే సౌందర్య తో చేసినప్పుడైనా ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ, మీనా తో సినిమాలు చేసినప్పుడు మాత్రం వెంకటేష్ కి ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు. ఆ సినిమాలు ఆయన కెరీర్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చి, మైలు రాళ్లుగా మారాయి. అలా వీళ్ళ కాంబినేషన్ లో ‘సుందరకాండ’, ‘చంటి’, ‘అబ్బాయి గారు’, ‘సూర్య వంశం’, ‘దృశ్యం’ , ‘దృశ్యం 2’ వంటి చిత్రాలు వచ్చాయి.
వీటి ఫలితాలు ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ కంటే ఎక్కువగా, దర్శక నిర్మాతలు వెంకటేష్ మీనా కాంబినేషన్ కి ఎక్కువ ఓట్లు వేసేవారట. కానీ వెంకటేష్ కి మాత్రం సౌందర్య తో సినిమాలు చెయ్యడమే ఇష్టం. కొన్ని సినిమాల్లో మీనా ని దర్శక నిర్మాతలు పెట్టుకుంటే, ఆమెని తప్పించి సౌందర్య ని పెట్టించేవాడట. ఈ విషయం తెలుసుకొని మీనా అప్పట్లో చాలా బాధపడింది అట.