Samantha కారణంగానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిందా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

- Advertisement -

Samantha : రీసెంట్ గానే వారుంటేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీ లో ఎంత ఘనంగా జరిగిందో మనమంతా చూసాము. ఇప్పటికీ వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. వీళ్ళ పెళ్లి జరిగేంత వరకు ఫ్యాన్స్ కి అది ఒక రూమర్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఎక్కడా కూడా వీళ్లిద్దరు తమ రిలేషన్ గురించి మీడియా ముందు ఓపెన్ అవ్వలేదు.

Samantha
Samantha

దీంతో ఎప్పటి లాగే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే రూమర్ లాగానే భావించారు. కానీ ఒక్కసారిగా వీళ్ళ పెళ్లి గురించి అధికారిక ప్రకటన రావడం తో అందరూ షాక్ కి గురి అయ్యారు. వీళ్లిద్దరు గతం లో కలిసి ‘మిస్టర్’ మరియు ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి కానీ, ఈ ఇద్దరినీ మాత్రం ఒకటి చెయ్యడం లో ఉపయోగపడ్డాయి.

Varun Tej Lavanya Tripathi

వీళ్లిద్దరి పెళ్లి జరగడానికి పరోక్షంగా సమంత ఒక కారణం..ఎందుకంటే ‘మిస్టర్’ సినిమా కి డైరెక్టర్ శ్రీను వైట్ల ముందుగా సమంత డేట్స్ కోసమే ప్రయత్నం చేసాడట. అయితే సమంత అప్పటికే రెండు మూడు సినిమాలు సమాంతరంగా చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది. ఒక రెండు నెలల వరకు డేట్స్ సర్దుబాటు చేయలేనని, అప్పటి వరకు ఆగగలిగితే ఆగండి, లేకపోతే వేరే హీరోయిన్ తో చేసుకోండి అని అన్నాడట.

- Advertisement -
Varunlav samantha

దీంతో శ్రీను వైట్ల అప్పుడే ఇండస్ట్రీ లోకి దూసుకొస్తున్న లావణ్య త్రిపాఠి ని అడగగా, ఆమె వెంటనే ఓకే చెప్పి ఈ చిత్రం లో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి కి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక్కడి నుండి వీళ్లిద్దరి జర్నీ మొదలైంది. ఇక ఆ తర్వాత అంతరిక్షం సినిమా సమయం లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ప్రపోజ్ చెయ్యడం, ఆమె అంగీకరించడం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here