Adivi Sesh : లేపుకొచ్చిన అమ్మాయితో తో సినిమా చెయ్యబోతున్న అడవి శేష్.. చరిత్రలో ఇదే తొలిసారి!

- Advertisement -

Adivi Sesh : ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి, చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కి దగ్గరై ఆ తర్వాత హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు అడవి శేష్. ఇప్పుడు టాలీవుడ్ లో అడవి శేష్ అంటే ఒక బ్రాండ్ అనే విధంగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యం గా స్పై జానర్ చిత్రాలకు ఆయన రోల్ మోడల్ లాగ మారింది.

Adivi Sesh
Adivi Sesh

హిట్ 2 తో రీసెంట్ గా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఊపు మీదున్న అడవి శేష్ అతి త్వరలోనే ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కెమెరా మెన్ షానిల్ డియోల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Adivi Sesh Photos

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది..శృతి హాసన్ తో సినిమా చేస్తుంటే పైన ‘లేపుకొచ్చిన హీరోయిన్ తో అడవి శేష్ సినిమా ‘ అని ఎందుకు క్యాప్షన్ పెట్టామనే కదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం, గతం లో మాస్ మహారాజ రవితేజ హీరోగా బలుపు అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అడవి శేష్ విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సెకండ్ హాఫ్ లో శృతి హాసన్ ని పెళ్లి చేసుకునేందుకు, తన బలగం తో వచ్చి కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్తాడు.

- Advertisement -
Adivi Sesh Shruti Haasan

ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలో అలాంటి పాత్ర చేసిన అడవి శేష్, ఇప్పుడు ఆమెని తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకునే రేంజ్ కి ఎదిగాడంటే అడవి శేష్ సక్సెస్ ఫుల్ జర్నీ టాలీవుడ్ లో ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ లో నటిస్తున్న అడవి శేష్, ఆ చిత్రం పూర్తి అవ్వగానే ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here