తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన హీరో ఆయన. ఒక పక్క ఎన్టీఆర్ పౌరాణికం మరో పక్క నాగేశ్వర రావు సాంఘిక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటే, వాళ్ళు వెళ్తున్న దారిలో కాకుండా బాండ్ మరియు కౌ బాయ్ వంటి సరికొత్త జానర్ సినిమాలను ఇండస్ట్రీ కి పరిచయం చేసిన మహానుభావుడు ఆయన.
ఆరోజుల్లో కృష్ణ గారికి ఉన్నంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరో స్టార్ హీరోకి ఉండేది కాదని, కల్ట్ ఫ్యాన్ బేస్ అనే పదం, ఆయనని చూసే పుట్టిందని అందరూ అంటూ ఉంటారు. అలాంటి మాస్ హీరో తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగుపెట్టిన రమేష్ బాబు, ఒకటి రెండు హిట్లు కొట్టి అభిమానులను అలరించాడు కానీ, స్టార్ హీరో మాత్రం అవ్వలేకపోయాడు.
రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ రమేష్ బాబు కి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాను అనే బాధ చాలా ఉండేది. ఎందుకంటే వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ సక్సెస్ అయ్యారు, కానీ నేను మాత్రం సక్సెస్ సాధించలేకపోయాను అనే బాధ రమేష్ బాబు లో ఉండేది. అది ఊహిస్తుంటేనే నాకు నరకం గా ఉంటుందని నాతో పలు సార్లు చెప్పాడు కూడా’ అంటూ ఆదిశేషగిరి రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే రమేష్ బాబు సక్సెస్ కాకపోయినా ఆయన తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఏ స్థాయిలో కొనసాగుతున్నాడో మన అందరం చూస్తూనే ఉన్నాం.