తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని మెగాస్టార్ చిరంజీవి కి ముందు , మెగాస్టార్ చిరంజీవి కి తర్వాత అని విభజించవచ్చు. ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత కమర్షియల్ సినిమా స్టైల్ మారిపోయింది. కథ ,స్క్రీన్ ప్లే, పాటలు , డ్యాన్స్ , ఫైట్స్ ఇలా అన్నీ కూడా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా మెగాస్టార్ డ్యాన్స్ చూస్తే ఆరోజుల్లో ఇలాంటి డ్యాన్స్ ఎలా వెయ్యగలిగాడు, అసలు ఆయనకీ ఆ ఆలోచన ఎలా వచ్చింది అని అనిపించక తప్పదు.

స్వయంకృషి తో ఎవరి అండాదండా లేకుండా అంచలంచలుగా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం. సుమారుగా నాలుగు దశాబ్దాల పాటుగా నెంబర్ 1 స్థానం లో కూర్చొని, ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ అత్యధిక 100 కోట్ల షేర్స్ సినిమాలు ఉన్న ఏకైక హీరో గా మెగాస్టార్ చిరంజీవి చరిత్ర సృష్టించాడు.

అలాంటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభం లో కూడా ఎన్నో అవమానాలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలు చెప్పిన మాట వినకపోతే తనకి కెరీర్ ఉండదేమో అనే భయం ఆయనలో అప్పట్లో చాలా ఉండేవట. హీరో గా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న చిరంజీవి కి శుభ లేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యా వంటి సూపర్ హిట్ సినిమాలు తగిలాయి. ఈ సినిమాల తర్వాత ఆయన హీరోగా మరో రేంజ్ కి వెళ్లకుండా కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు అడ్డుపడ్డారట. అప్పట్లో ఒక టాప్ డైరెక్టర్ కృష్ణ గారి పక్కన చిన్న క్యారక్టర్ ఉంది , అది నువ్వే వెయ్యాలి అని అడిగారట.

అది కాదు సార్ ఇప్పుడిప్పుడే నాకు హీరో గా రెండు హిట్లు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తే కెరీర్ పోతుంది అని చెప్పినా కూడా , కృష్ణ లాంటి స్టార్ పక్కన నటించడం నీ అదృష్టం అయ్యా అని చెప్పి ఆయనతో బలవంతంగా సినిమాలు చెయ్యిచేవారట. అలా చాలా కాలం వరకు చిరంజీవి ని ఎదగనియ్యకుండా తొక్కేసారట. కానీ చిరంజీవి లో ఉన్న చురుకుదనమే, నటన , డ్యాన్స్ , ఫైట్స్ లో ఆయన చూపించే ఈజ్ నేడు ఈ స్థానం లో నిలబెట్టింది అని అభిమానులు కొంతమంది సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు.