Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ సినిమా అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో, ఆ రేంజ్ అంచనాలను అందుకోలేకపోవడం వల్లే ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందని అందరూ అంటూ ఉంటారు.
కోస్తాంధ్రలో తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాలలో కూడా ఈ సినిమాని కొన్ని బయ్యర్స్ కి 50 శాతం కి పైగా నష్టాలు వచ్చాయి. అయితే కొంతమంది ఈ సినిమా ని చూసిన వాళ్ళు, గుంటూరు కారం చిత్రం మాస్ ఆడియన్స్ ఎలా అయితే కోరుకుంటున్నారో, అలాగే ఉంది, కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా, కొంతమంది కుట్రలు చేసి నెగటివ్ టాక్ తీసుకొని రావడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు.
అయితే ఇటీవలే ఈ చిత్రానికి ఓటీటీ లో వస్తున్న రెస్పాన్స్ ని బట్టీ చూస్తే వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి కేవలం మూడు రోజుల్లోనే 3.5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఇది లేటెస్ట్ టాలీవుడ్ రికార్డు అని అంటున్నారు. థియేటర్ లో ఈ సినిమాని చూడని వాళ్ళు, ఇంత మంచి సినిమాని ఎలా ఫ్లాప్ చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా సలార్ రికార్డు ని సైతం బద్దలు కొట్టిందట. ‘సలార్’ చిత్రానికి పది రోజులకు కలిపి 3.2 మిలియన్ వ్యూస్ వస్తే, ‘గుంటూరు కారం’ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయట. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, కంటెంట్ పరంగా గుంటూరు కారం ఫ్లాప్ అయ్యే రేంజ్ కాదని, కావాలని తొక్కేశారని అని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.