హనుమంతుడి పై ఆదిపురుష్ డైరెక్టర్ ఇంత నీచమైన కామెంట్స్ చేశాడా..? చూస్తే మీ రక్తం మరిగిపోతాది!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా 7000 కి పైగా థియేటర్స్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడం తో మొదటి ఆట నుండే కాస్త డివైడ్ టాక్ వచ్చింది. రామాయణం ని ఇష్టమొచ్చినట్టు , ఎలా పడితే అలా డైరెక్టర్ ఓం రౌత్ తీసాడని, పురాణాల్లో ఎక్కడా లేని విధంగా రావణాసురుడిని చూపించడం, రాముడికి మీసాలు పెట్టడం ఇలాంటివన్నీ ఆడియన్స్ కి చిరాకు కలిగించాయి.

ఆదిపురుష్ డైరెక్టర్
ఆదిపురుష్ డైరెక్టర్

అయితే రాముడు కచ్చితంగా ఇలాగే ఉంటాడు, రావణాసురుడు ఇలాగే ఉంటాడు అని ఎక్కడా లేదు కాబట్టి నా ఇష్టప్రకారం రామాయణం ని ఎలా చూపించాలి అనుకున్నానో అలా చూపించాను అంటూ కామెంట్ చేసాడు. సినిమా ప్రారంభం లో కూడా ముందుమాటగా అదే చెప్పుకొచ్చానని చెప్పాడు ఓం రౌత్.

అయితే ఓం రౌత్ కావాలనే హిందీ పురాణాలను అపహాస్యం చెయ్యాలని ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని తీసినట్టుగా కొంతమంది భావిస్తున్నారు. అందుకు ఆధారాలు చాలానే ఉన్నాయి. గతం లో ఓం రౌత్ ‘హనుమాన్ జయంతి’ నాడు వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది, ఆ ట్వీట్ లో ఏముందంటే ‘హనుమంతుడు కి ఏమైనా చెముడు ఉందా, ఆయనకీ చెవులు పనిచేయవా?, ఏంలేదు మా ఇంటి చుట్టూ పక్కన హనుమాన్ పాటలు పెద్ద సౌండ్ పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు ‘హనుమాన్ జయంతి’ పేరు చెప్పుకొని’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు బయటపడ్డాయి.

- Advertisement -

అవి సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. అంతే కాదు గతం లో ఆయన గణేష్ చతుర్థి మీద , మరియు వరుణ దేవుడి మీద కూడా సెటైర్లు విసిరాడు. ఆయన చేసిన కామెంట్స్ ని మీరు క్రింది ఫోటోలలో చూడవచ్చు. మన దేవుళ్ళ మీద, పురాణాల మీద ఇలాంటి వెటకారం చేసినోడు, రామాయణం ఇలా కాకుండా ఇక ఎలా చూపిస్తాడు అంటూ నెటిజెన్స్ ఓం రౌత్ పై పెదవి విరుస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here