Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చినప్పటికీ ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ రావడం అంత సులువు కాదు అనే చెప్పాలి.’చిరుత’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తొలి సినిమాతోనే స్టార్ హీరో అనిపించుకున్న రామ్ చరణ్, రెండవ సినిమా మగధీర తో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని చెరిపేసి, నెంబర్ 1 హీరో రేస్ లోకి దూసుకొచ్చాడు.

ఈ సినిమాతోనే కాజల్ అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు ఈమె కేవలం చిన్న హీరోల సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యేది. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో మగధీర చిత్రం ఆమెకి ఒక వరం లాగ దక్కింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయం లోనే కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కి బాగా క్లోజ్ అయ్యింది.

అప్పట్లో రామ్ చరణ్ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే, తన ప్రతీ సినిమాలోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టేవాడట డైరెక్టర్స్ దగ్గర. అలా తన మూడవ సినిమా ‘మెరుపు’ లో కూడా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రారంభించిన ఈ సినిమాకి ‘బంగారం’ సినిమా దర్శకుడు ధరణి దర్శకుడిగా ఖరారు అయ్యాడు. పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.

ఆ తర్వాత కూడా రామ్ చరణ్ డైరెక్టర్స్ అనుకున్న హీరోయిన్స్ డేట్స్ దొరకకపోతే కాజల్ ని తీసుకోండి అంటూ రికమెండ్ చేసేవాడట. అలా రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రం తర్వాత కాజల్ తో నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలా వంటి సినిమాలు చేసాడు. గోవిందుడు అందరివాడేలే సినిమా సమయం లో కృష్ణ వంశీ కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉండేవాడట. కానీ రామ్ చరణ్ మాత్రం పట్టుబట్టి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకొచ్చేలా చేసాడట.
