Rajeev Kanakala : సుమ .. ఈ పేనుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబుల్ క్రేజ్ ఆమె సొంతం. ఇటీవల తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఆమె యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఫ్యాన్స్ కోసం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజీవ్ కనకాల, సుమ ఫిబ్రవరి 10వ తేదీన పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. వాళ్ల పెళ్లి అయ్యి ఇప్పటికే 25 ఏళ్లు దాటింది. ఈ శుభసందర్భంగా వృద్ధాశ్రమంలో సుమ, రాజీవ్ పెద్దవాళ్లతో గడిపారు. అనంతరం తమ యూట్యూబ్ ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుమ.
ఈ కార్యక్రమంలో సుమ, రాజీవ్ ఇద్దరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు . పెళ్లయిన కొత్తలో భార్య కోసం సమయం కేటాయించాలని రాజీవ్ కనకాల అన్నారు. అవును పార్టనర్ కి ఎక్కువ సమయం కేటాయించాలి.. పిల్లలు పుట్టాక బాధ్యతలు కూడా తీసుకోవాలి అంటూ తెలిపింది సుమ. మీ భార్యకు తెలియకుండా ఎప్పుడైనా ఫోన్ చెక్ చేశారా అని ఓ సబ్ స్కైబర్ అడిగిన ప్రశ్నకు రాజీవ్ లేదంటూ సమాధానం చెప్పాడు. సుమని అడిగితే మాత్రం అవును ఒక్కసారి అంటూ నవ్వుతూ అసలు నిజాన్ని బయట పెట్టేసింది. దీంతో రాజీవ్ కనకాల షాక్ అవుతాడు.
కానీ అందులో ఏమీ దొరకలేదంటూ ట్విస్ట్ ఇచ్చింది సుమ. దొరికేలా ఎందుకు పెడతాం అంటూ రాజీవ్ కనకాల సెటైర్ వేశాడు. అంతేకాదు అందరి ముందు సుమకి సారీ చెప్తాడు రాజీవ్ కనకాల. ఎప్పుడు అడిగినా ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని చెబుతాడు.. కానీ రాడు అని సుమ బాధపడింది. దానికోసం రాజీవ్ కనకాల క్షమాపణలు కోరాడు. భర్త సారీ చెప్పగానే సుమ తెగ ఎంజాయ్ చేసింది . అయితే రాజీవ్ కనకాల తనని మరో విషయంలో కూడా బాధపెట్టాడని చెప్పుకొస్తుంది సుమ. రాజీవ్ ఎక్కువగా దెయ్యాలు, హర్రర్ కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తాడట. తాను కడుపుతో ఉన్న సమయంలో కూడా అలాంటి సినిమాలే చూపించి భయపెట్టాడని బాధపడింది. ప్రస్తుతం వీళ్లకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.