ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల కేసు సోషల్ మీడియాలో..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. మెగా కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు జొన్నలగడ్డ చైతన్యతో మెగా సంబంధాలు తెగిపోయాయి. వీరి విడాకుల వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని కవర్ చేస్తూ.. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు ధ్రువీకరించే పత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.

వీరిద్దరికీ విడాకులకు హైదరాబాద్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇక కలిసి జీవించలేమని కోర్టులో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల సమస్యలను విన్న కోర్టు.. ఇద్దరూ దూరంగా ఉండటమే మంచిదని తీర్పునిచ్చింది. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో మరో డైవర్సని అధికారికంగా ధృవీకరించారు.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత భరణం కింద భార్య.. భర్తను డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విడాకులు తీసుకున్న తర్వాత భర్త నుంచి భరణం తీసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే నీహారిక కూడా 100 కోట్లు డిమాండ్ చేసింది అని ప్రచారం జరిగింది. అయితే నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి భరణంగా వద్దు అంటూ తెగేసి చెప్పిందట. నా కాళ్ళ మీద నేను నిలబడి ఉంటాను.. నాకు వాళ్ళ దయాదాక్షణ్యాలు అవసరం లేదు అంటూ ముఖానే.. తెగేసి కోర్టులో ఒక్క రూపాయి భరణం వద్దు అంటూ తేల్చి చెప్పిందట . దీంతో మెగా ఆడపడుచుకి ఎంత పౌరుషమో అంటూ మెగా ఫాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు నీహారిక డబ్బు మనిషి కాదు అని తెలిసి..ఆమె డేర్ చూసి చైతన్య కి తడిసిపోయుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క నిహారిక చైతన్య లాంటి మంచి హస్బెండ్ మిస్ అయింది అంటూ బాధపడుతున్నారు..!!