Teja Sajja : బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తేజ సజ్జల, ఈమధ్యనే హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నటించిన సినిమాలలో ‘జాంబీ రెడ్డి’ మంచి కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు, ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే ‘హనుమాన్’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేసాడు తేజా. ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఉన్న అంచనాలు మామూలైవి కావు. గత ఏడాది టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం.

ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ ఔట్పుట్ అసలు ఊహించలేదు, ఇది కచ్చితంగా ప్రశాంత్ వర్మ సృజనాత్మకతకు నిదర్శనం అంటూ ఆడియన్స్ అందరూ ఆయన్ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతుంది మూవీ టీం.

అందులో భాగంగా తేజ సజ్జల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. యాంకర్ మాట్లాడుతూ ‘చిన్నప్పుడు మీరు స్టార్ కిడ్, ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించారు. అలాంటి మీరు పెద్దయ్యాక మొదటి సినిమా హీరో గా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఓ బేబీ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చెయ్యడానికి ఎందుకు ఒప్పుకున్నారు?’ అని అడుగుతాడు.

దానికి తేజా సమాధానం ఇస్తూ ‘అప్పట్లో నాకు హీరో గా అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధం గా లేరు. ఆ సమయం లో నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఒప్పుకున్నాను. సమంత గారు నాకు చాలా సహాయం చేసారు, కొత్త కుర్రాడు బాగా ఎలివేట్ అవ్వాలని చాలా సన్నివేశాలు నన్ను హైలైట్ చెయ్యడానికి నందిని రెడ్డి తో అడిగి మరీ సీన్స్ పెట్టించింది. నాకు ఆమె ఇచ్చిన ఆ ప్రోత్సాహం ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ తేజ సజ్జల చెప్పుకొచ్చాడు.
