ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, సోషల్ మీడియా లేని రోజుల్లో కేవలం మూవీ ఆడిషన్స్ ద్వారా అవకాశాలను సంపాదించుకొని, అంచలంచలుగా ఎదిగి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. ఈమె అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఇందులో ఆమెది కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న సెకండ్ హీరోయిన్ రోల్ అయ్యినప్పటికీ,తన అందం మరియు నటన తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది.

ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈమెకి టాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి. అలా చిన్నగా గుర్తింపు దక్కించుకుంటున్న రోజుల్లో రాజమౌళి – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు , తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ రేంజ్ వసూళ్లను దక్కించుకోగా, అనుష్క కి లేడీ సూపర్ స్టార్ ఇమేజి వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చింది. ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ముందుగా ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకుంది.

అప్పట్లో హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో తనకి జీవనాదారం కోసం యోగ టీచర్ గా కెరీర్ ని ప్రారంభించింది. అలా మంచి పాపులారిటీ ని దక్కించుకున్నాక అక్కినేని నాగార్జున కుటుంబం లో నాగ చైతన్య, అఖిల్ కి యోగా కోచ్ గా పని చేసింది. ఆ తర్వాత ఈమె రామ్ చరణ్ , బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కి కూడా యోగా టీచర్ గా పని చేసిందట. ఈ విషయం ఇన్ని రోజులకు బయటపడి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
