Hansika : అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి హన్సిక. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘కోయి మిల్ గయా’ అనే చిత్రం ద్వారా బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా నటించింది. అలా కెరీర్ సాగుతున్న సమయం లో ఆమెకి పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

తొలి సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో హన్సిక కి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. అదే సమయం లో ఆమెకి తమిళం లో కూడా అవకాశాల వెల్లువ కురిసింది. తెలుగు కంటే ఎక్కువగా ఆమె తమిళ సినిమాలకే అత్యధిక సమయం కేటాయించింది. తమిళ వాళ్లకు బొద్దుగా ఉండే హీరోయిన్స్ అంటే బాగా ఇష్టం, కాబట్టి హన్సిక అక్కడే స్థిరపడింది అనే టాక్ ఉండేది అప్పట్లో.

తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉండేది. తెలుగు లో ఆమె కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో ఎందుకు ఇక్కడ ఎక్కువగా సినిమాలు చెయ్యలేకపోయింది అనే దానికి ఒక బలమైన కారణం కూడా ఉందట. అదేమిటంటే హన్సిక తో టాలీవుడ్ లో ఒక పేరున్న స్టార్ హీరో ప్రైవేట్ పార్టీలో అసభ్యంగా ప్రవర్తించాడట. అంతకు ముందు అతనితో హన్సిక ఎలాంటి సినిమా చెయ్యలేదు. కేవలం పార్టీలో మాత్రమే కలుసుకున్నారట.

అలా తొలి పరిచయం లోనే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ, దగ్గరకు వచ్చి ముట్టుకునే ప్రయత్నం చేసాడట. హన్సిక ఆరోజు పార్టీ లో పెద్దగా అరిచి ఏడుస్తూ వెళ్లిపోయిందట. అప్పటి నుండి ఆమె టాలీవుడ్ తనకి బాగా పరిచయం ఉన్న హీరోలతో తప్ప, మిగిలిన ఏ హీరో తో కూడా చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకుందట. అలా టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా హన్సిక చెయ్యడానికి ఒప్పుకోలేదని ఒక టాక్ ఉంది.
