Bandla Ganesh : ఒక సాధారణ కమెడియన్ గా ఇండస్ట్రీ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకడు. ఈయనేమి టాప్ కమెడియన్స్ క్యాటగిరీ కి చెందిన వాడు కాదు, ఒక గ్రూప్ లో నలుగురు కమెడియన్స్ ఉంటె అందులో ఒక్కడిగా ఉంటూ వచ్చేవాడు. అలాంటి పాత్రల ద్వారానే ఫేమస్ అయిన ఈయన అకస్మాత్తుగా టాప్ మోస్ట్ నిర్మాతగా మారిపోయి ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో సినిమా తీసే రేంజ్ కి ఎదగడంని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
బండ్ల గణేష్ కామెడీ పాత్రలతో ఇంత సంపాదించాడా?, అది ఎలా సాధ్యం అసలు అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయన సినిమాల్లోకి రాకముందే పెద్ద వ్యాపారవేత్త, హైదరాబాద్ లో అతనికి ఒక పెద్ద కోళ్ల ఫామ్ ఉంది. ఈయన ఫామ్ నుండి వచ్చిన గుడ్లే హైదరాబాద్ లో సగానికి పైగా జనాలు వాడుతారట. ఆ స్థాయి ఉంది కాబట్టే నేడు ఇండస్ట్రీ లో ఈ రేంజ్ కి వచ్చాడు.
ఇకపోతే బండ్ల గణేష్ నిన్ననే చెక్ బౌన్స్ కేసు లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ కి ఈ చెక్ బౌన్స్ కేసులు కొత్త కాదు, గతం లో ఈయన ఇలాగే ఎంతోమందికి ఫేక్ చెక్కులు అందించాడట. అంతే కాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు రెమ్యూనరేషన్స్ విషయం లో కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడట. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలై వంద రోజులు పూర్తి అయ్యినప్పుడు పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చాడట.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ‘టెంపర్’ సినిమా సమయం లో కూడా ఇలాగే చేసాడు. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఇస్తేనే డబ్బింగ్ చెప్తా అనే రేంజ్ కి వచ్చాడంటే, బండ్ల గణేష్ ఏ రేంజ్ లో విసిగించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా సమయం లో కూడా ఇలా రెమ్యూనరేషన్ విషయం లో ఇబ్బంది పెట్టాడు. ప్రముఖ హీరో సచిన్ జోషి తో కూడా నిర్మాణ రంగం లో భాగస్వామి అయ్యి అతన్ని కూడా మోసం చేసాడు. ఇలా బండ్ల గణేష్ హిస్టరీ ని తవ్వితే వస్తూనే ఉంటుంది. అందుకే ఆయన అరెస్ట్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.