పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు, లవ్ స్టోరీస్ ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి ‘తొలిప్రేమ’. అప్పటి వరకు చాలా మామూలు హీరోస్ లో ఒకడిగా కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో స్టార్ హీరో గా మారాడు. యూత్ ఐకాన్ గా నిలిచాడు. ముఖ్యంగా ఇందులో ఆయన నటనని చూస్తే ప్రతీ సామాన్యుడికి తన నిజ జీవితాన్ని వెండితెర మీద చూసుకున్నట్టుగా అనిపిస్తాది.
అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్. అతని కెరీర్ లో ఎన్నో సినిమాలు తీసాడు కానీ, ఇలాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాన్ని మాత్రం మళ్ళీ రీ క్రియేట్ చెయ్యలేకపోయాడు. ఇలాంటి క్లాసిక్స్ ని రీ క్రియేట్ చెయ్యడం కూడా చాలా కష్టం. ఇక ఈ సినిమా విడుదలై పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా రీ రిలీజ్ జూన్ 30 వ తారీఖున విడుదల చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా గతం లో ఈ సినిమా క్లైమాక్స్ గురించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్పిన మాటలను కరుణాకరన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన కరుణాకరన్ తో ఏమన్నాడు అంటే ‘ నేను నీ తొలిప్రేమ క్లైమాక్స్ చూస్తున్నపుడు నా కార్ తాళాలను స్క్రీన్ మీదకి విసిరేసాను. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఏమిటి, అసలు ఏమి చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ ఈ సినిమాతో అని అనుకున్నాను.
కానీ జయాబచ్చన్ స్లో గా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రావడాన్ని చూసి చప్పట్లు కొడుతుంది, ఆ తర్వాత అబ్బా ఏమి సినిమా ఇది, క్లాసిక్ అనిపించింది’ అని కరుణాకరన్ తో అన్నాడట అమితాబ్ బచ్చన్. చెన్నై కి వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ కరుణాకరన్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు అట ఇవి . ఈ వీడియో నేడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.