తాను మైదానంలో దూకాడంటే పరుగుల వరద పారాల్సిందే. తనదైన శైలి హెలికాప్టర్ సిక్స్‌లతో బాలన్నీ బౌండరీలు దాటాల్సిందే.. ఎవరికీ సాధ్యం కాని మూడు ఐసీసీ కప్ లను ఇండియాకు కట్టబెట్టిన ది లెజండరీ బ్యాట్స్ మెన్ ధోనీ తెరపై కనిపించబోతున్నాడు.. అది విలన్ గా ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం. ఇప్పటికే ధోని సినిమా రంగంలో కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాను ఓ నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘లెట్స్ గెట్ మ్యారేజ్’ అనే నేతమిళ్ సినిమాను నిర్మించాడు.
ధనాధన్ షాట్లతో తన అభిమానులకు మైమరపించే ఈ జార్ఖండ్ డైనమైట్ 2020లో క్రికెట్ కు గుడ్ బై పలికాడు. కేవలం చైన్నై తరపున ఐపీఎల్ మ్యాచుల్లో మాత్రమే ఆడుతున్నాడు. రీసెంట్గా ధోని సినిమాల్లో కనిపించబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. అది కూడా సౌత్ స్టార్ అయిన విజయ్ దళపతి సినిమాలో.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొలి చిత్రంలోనే విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడట ధోని తెలుస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, త్వరలోనే చిత్ర బృందం ఈ వార్తపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థిగా ధోని ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఇందులో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. కొన్నేళ్ల తర్వాత త్రిష విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి సౌత్ సెన్సెషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయడానికి ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు. లియో సినిమా పూర్తి కాగానే దర్శకుడు వెంకట్ ప్రభు తో విజయ్ ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ విజయ్ 68 వర్కింగ్ టైటిల్ తో ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా జ్యోతిక నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నాడు.