టాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రముఖులు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. తాజాగా టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరోయోగ్రాఫర్ గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. దానికంటే ముందుగా సూసైడ్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ తెలిపినట్లు సమాచారం. ఆ వీడియో చూసినవాళ్లు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అది వైరలవుతోంది.

నెల్లూరులోని ఓ హోటల్ లో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని సమాచారం. సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటీ డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పారు. ఇల్లు గడవక అప్పులు చేశానని.. వాళ్లంతా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా తీర్చలేకపోతున్నానని చైతన్య ఆ వీడియోలో చెప్పారు.

ఇక టీవీ రంగంలోనే ఢీ షో అత్యధిక పాపులారిటీ సంపాదించుకుంది. 2009లో ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షో వరుసగా సీజన్ల మీద సీజన్ల చేస్తూ అలరిస్తుంది. తో మంది టాలెంటెడ్ డాన్సర్స్ కి, కొరియోగ్రాఫర్లకి సినీ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఢీ షో 15వ సీజన్ నడుస్తోంది. ఢీ 15 ఛాంపియన్స్ బ్యాటిల్ షిప్ పేరుతో సరికొత్తగా డ్యాన్స్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నారు. దీనికి రేటింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇతర డ్యాన్స్ షోల కంటే ఇది టాప్లో ఉంటుంది.