Deepthi Sunaina.. యూట్యూబ్‌లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ సెన్సేషన్. అందరూ టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వీడియోలు చేస్తూ కాస్త పాపులారిటీ రాగానే సినిమాల్లోకి వెళ్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం యూట్యూబ్‌లోనే తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వస్తోంది. ఏడాదికో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది. ఈ భామ నటించిన ఓ క్షణం నవ్వునే విసురు, తట్టుకోలేదే, ఏమయ్యుండచ్చో, ఏమోనే, మలుపు, చిలకా.. పాటలు యూట్యూబ్ లక్షలు, కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తట్టుకోలేదే, ఓ క్షణం నవ్వునే విసురు పాటలు ఈ భామ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచి సినిమా పాటలకు గట్టి పోటీనిచ్చాయి.

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంలో దీప్తికి ఎవరూ పోటీ రారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తన డేలోని ప్రతి అప్డేట్ను షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఇక బోర్ కొడితే తన ఫ్యాన్స్‌తో ఆస్క్ మీ అంటూ క్వశ్చన్ సెషన్ కూడా పెట్టేస్తుంది. ఈ క్వశ్చన్ సెషన్లో తన ఫ్యాన్స్ అంటే సిల్లీ, నాటీ క్వశ్చన్లకు కూడా చాలా ఓపిగ్గా, కాస్త నాటీగా రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇక దీప్తి సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫొటోలంటే ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతుంటారు.
ఈ బ్యూటీ ట్రెడిషనల్ , వెస్టర్న్, బోల్డ్.. ఇలా లుక్ ఏదైనా తన సత్తా చూపించేస్తుంటుంది. ఈ మధ్య కాస్త బోల్డ్ ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో దీప్తి ఫొటోలు చూసి కుర్రకారు మెస్మరైజ్ అవుతున్నారు. కాస్త క్లీవేజ్ షో చేస్తూ ఈ బ్యూటీ ఘాటు పోజులతో కైపెక్కించేసింది. ఇక నాటీ పోజులిస్తూ కాస్త రెచ్చ గొట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. దీప్తి బేబీకి కాస్త బోల్డ్నెస్ ఎక్కువై పోయిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఏ హీరోయిన్లే ఎక్స్పోజ్ చేయాలా ఏంటి అంటూ ఇంకొందరు వాళ్లకు రిప్లై ఇస్తున్నారు.