Deepthi Sunaina : సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన (Deepthi Sunaina) గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది. మొదట జనాల్లో తన చేష్ఠలతో కొంత నెగిటివిటీ తెచ్చుకున్నా తర్వాత మెల్లిమెల్లిగా కాస్త పాజిటివ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తాను తెలియక చేసిన తప్పులను క్షమించండి అని నెట్టింట్లో వేడుకోవడంతో జనాలు కాస్త కూల్ అయ్యారు. దీప్తి సునయను అర్థం చేసుకున్నారు.

ఇక ఈ అమ్మడు షణ్నూ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని రోజులు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. షణ్నూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక షణ్నూ బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన రొమాన్స్, నడిపిన ట్రాక్ చూసి దీప్తి సునయనకు నచ్చనట్టుంది. అందుకే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత షణ్నూకు బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. ఇద్దరి ప్రపంచాలు వేర్వేరు అయ్యాయి.

తాజాగా దీప్తి సునయన తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్ ఇలా సలహా అడిగాడు. వన్ సైడ్ లవ్ అని, ఐ లవ్యూ అని చెప్పే ధైర్యం చాలడం లేదు ఏం చేయాలి? అని అడిగాడు. దీనికి దీప్తి సునయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. కొన్ని పనులు వెంటనే చేయాలి. ఆలస్యం చేస్తే తర్వాత ఉపయోగం ఉండదు. ఆకలి వేస్తే వెంటనే తినేయాలి.. ఇలా ప్రేమ ఉన్నప్పుడు వెంటనే చెప్పేయాలి.. లేదంటే నాలాంటి పరిస్థితే మీకు వస్తుంది అని చెప్పేసింది.