Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకొణె పేరు ఫస్టులో ఉంటుంది. ఫస్ట్ సినిమానే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడికి తిరుగులేకుండా పోయింది. తర్వాత ఆమె చాలా సూపర్‌హిట్ చిత్రాలలో పనిచేసింది. బాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లో కూడా తన మ్యాజిక్ చూపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ కూడా దీపికానే అనడంతో సందేహమే లేదు. అయితే ఇక్కడి వరకు దీపిక ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఆమె సినిమాల్లోకి రాకముందు చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని దీపికనే స్వయంగా వెల్లడించింది.
ఇటీవల ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె తన కష్టాల గురించి మాట్లాడింది. తాను ఒంటరిగా కొత్త నగరానికి వచ్చి తన బ్యాగ్‌తో ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను అర్థరాత్రి వరకు పని చేసేదానినని చెప్పింది. ఆ సమయంలో ఎక్కడి వెళ్లాల్సి వచ్చినా తాను తన సూట్ కేసులతో క్యాబ్ లోనే నిద్ర పోయే దానినని చెప్పింది. తాను ఇంటికి వచ్చే వరకు ఆమె తల్లి చాలా ఆందోళన చెందేదని దీపిక తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో వివాహ జీవితం గురించి కూడా మాట్లాడింది.
తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో ఎక్కువ సమయం గడపడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎంత బిజీగా ఉన్నా తను రణవీర్ సింగ్ కోసం సమయం కేటాయిస్తానని చెప్పింది. చాలా మంది భర్తలతో గడపడానికి సమయం చాలట్లేదని అంటారు. కానీ కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదని తెలిపింది. వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. దీపికా పదుకొణె త్వరలో ఫైటర్ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె హృతిక్ రోషన్ సరసన నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 26న సినిమా విడుదల కానుంది.