Deepika Padukone అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడకకు హాలీవుడ్ తారలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ కు నామినేట్ అయిన, ఆస్కార్ అందించే గెస్టులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై విభిన్న ఔట్ ఫిట్స్ లో నడిచి సందడి చేశారు.

95 ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పడుకోన్ సందడి చేసింది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై వయ్యారంగా నడుస్తూ ఇంగ్లీష్ ఆడియెన్స్ మనసు దోచేసింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో దీపిక అందం చూసి గెస్టులంతా స్టన్ అయ్యారు. ఈ బ్యూటీ స్మైల్ చూసి మెస్మరైజ్ అయ్యారు.

బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో దీపికా ఆస్కార్ వేడుకల్లో సందడి చేసింది. క్లీవేజ్ షోతో హాట్ గా కనిపించినా.. తన సొట్టబుగ్గలతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ముఖ్యంగా దీపు మెడలో ఉన్న పెండెంట్ మెరుస్తూ తనకు మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఈ వేడుకల్లో దీపిక హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు.

ఇక ఈ వేడుకల్లో దీపికా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్ ముందు పాటను పరిచయం చేసింది. పాట గురించి అక్కడున్న తారలకు వివరించింది. దీపిక నాటు నాటుకు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాట పాడగా.. విదేశీ నటులు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు.
ఇక ఆస్కార్ రెడ్ కార్పెట్ పై దీపిక స్టైల్ చూసి కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. దీపికా ఎక్కడున్నా తన అందంతో చుట్టూ ఉన్న వాళ్లని మాయ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన స్మైల్ తో మెస్మరైజ్ చేస్తుందని పొగిడేస్తున్నారు. దీపికా పదుకొనే అందం చూసి మళ్లీ తన మాయలో పడిపోతున్నామని అంటున్నారు. ఈ బ్యూటీ అందానికి ఇండియన్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.