Deepika Padukone : ‘కల్కి2898ఏడి’ సినిమాకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గ వారం కూడా లేదు. దీంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె హాజరయ్యారు. బేబీ బంప్‌తో కనిపించిన దీపికను చూసి అభిమానులు మురిసిపోయారు. తను స్టేజీపైకి వస్తుంటే బిగ్‌బీ చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చారు. ప్రభాస్ ఆమెను కూర్చోమని చెప్పి కుర్చీ వేయించాడు.

ఈ ఈవెంట్‌లో దాదాపు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్‌ల్లోనే మెరిసిపోయారు. దీపికా సైతం టైట్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, బిగ్‌బీ అమితామ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కోటగిర వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ ఈవెంట్ లో దీపిక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సింపుల్‌గా వచ్చినప్పటికీ ఖరీదైన బ్రేస్‌లెట్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమానికి దీపికా పదుకొణె పెట్టుకున్న వజ్రాల బ్రేస్‌లెట్ ధర ఏకంగా 1 కోటి 16 లక్షల రూపాయలని సమాచారం. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంత చిన్న దానికి అంత డబ్బు ఖర్చు పెట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram