Dasara Collections : IPL మ్యాచుని తట్టుకొని ‘దసరా’ రెండవ రోజు ఇంత వసూళ్లను రాబట్టిందా..! ట్రేడ్ మొత్తం షాక్

- Advertisement -

Dasara Collections : IPL సీజన్ ప్రారంభం అయితే సినిమా ఇండస్ట్రీ కి గడ్డు కాలం మొదలైనట్టే అని అందరూ అంటూ ఉంటారు.కానీ కొన్ని సినిమాలు మాత్రం IPL సీజన్ ని కూడా తట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించినవి ఇది వరకు మనం చాలానే చూసాము.ఆ జాబితాలోకి ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ కూడా చేరిపోయింది.

Dasara Collections
Dasara Collections

మార్చి 30 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఓపెనింగ్స్ కూడా స్టార్ హీరో రేంజ్ లో వచ్చాయి.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణ లో మాత్రం రికార్డు స్థాయి షేర్ ని దక్కించుకుంది.

Nani Dasara Movie

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు తెలంగాణ లో మూడు కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నాని గత చిత్రం ‘అంటే సుందరానికి’ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు, అలాంటిది రెండవ రోజు నైజాం ప్రాంతం నుండి మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం విశేషం.అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మొదటి రోజు కంటే రెండవ రోజు వసూళ్లు 50 శాతం పడిపోయినట్టు తెలుస్తుంది.

- Advertisement -
Actor Nani
Actor Nani

ఆంధ్రప్రదేశ్ లో పండుగ రోజు తర్వాత వర్కింగ్ డే ఉంటే వసూళ్లు బాగా తగ్గుతాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే, ‘దసరా‘ వసూళ్లు కూడా అదే విధంగా తగ్గాయని అంటున్నారు విశ్లేషకులు. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రెండవ రోజు 7 కోట్ల రూపాయిల వరకు షేర్ ని వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈరోజు రేపు వీకెండ్ అవ్వడం తో వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here