Dasara Collections : టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు నాని. తాజాగా విడుదలైన దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన హవా కొనసాగిస్తున్నారు నాని. నాని కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇప్పటివరకు ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి మనం తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే కీర్తి సురేష్ నాని ఆరేళ్ల తర్వాత జంటగా నటించిన దసరా సినిమా వీరిద్దరి కెరియర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెలగా ఆకట్టుకోగా.. నాని ధరణి క్యారెక్టర్ లో బాగా ఆకట్టుకున్నారు. దసరా సినిమా తెలుగు రాష్ట్రాలలోనీ నైజాం రూ.13.70 కోట్ల రూపాయలు. సీడెడ్ రూ.6.50 కోట్ల రూపాయలు ఆంధ్రాలో కలుపుకొని మొత్తం రూ.14.45 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా..మొత్తం మీద ఈ సినిమా రూ.34.65 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది..

ఇక కర్ణాటకలో రూ.1.85 కోట్ల రూపాయలు ఇతర భాషలో రూ.1.50 కోట్లు నార్త్ ఇండియాలో రూ.4 కోట్లు ఓవర్సీస్ లో రూ.6 కోట్లు.. ఇలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా రూ.48 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2700 థియేటర్లలో విడుదలవ్వడం జరిగింది. దసరా సినిమా 5వ రోజు కూడా 19.88 శాతం థియేటర్ ఆగి పెన్సి నమోదు అవ్వడం జరిగింది. ఈరోజు ఒక్కటే ఈ సినిమాకు రూ .4కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం.
ఇక దసరా సినిమాకు ఈరోజుతో కలుపుకొని దాదాపుగా రూ.61.65 కోట్ల రూపాయలు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చినట్లుగా ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నారు అయితే ఈ రోజున భారీగా కలెక్షన్లు తగ్గినప్పటికీ ఈ సినిమా ఇప్పటివరకు రూ.90 కోట్ల క్రాస్ కలెక్షన్ చేసినట్లు సమాచారం ఇక ఈ రోజుతో రూ.100 కోట్ల క్లబ్బులో చేరిపోయినట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి దసరా సినిమా.
Dharani continues to rule the Box Office 💥#Dasara grosses 92+ CRORES WORLDWIDE IN 5 DAYS 🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) April 4, 2023
Watch #Dasara in cinemas today 💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/3KJ9eMiTfr