Keerthy Suresh సినిమా విడుదలకు ముందే ఆ మూవీని ప్రేక్షకుల మెదడులోకి ఎక్కించాలనే ఉద్దేశంతో డైరెక్టర్లు తెలివిగా ఆ చిత్రంలోని పాటలు రిలీజ్ చేస్తారు. అలా పాటలు హిట్ అయ్యాక.. నెమ్మదిగా ప్రేక్షకులకు ఆ సినిమాపై ఆసక్తి కలుగుతుంది. దీన్నే ఆ చిత్రబృందం క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుతం ట్రెండ్ అంతా ఇదే నడుస్తోంది. సినిమా టైటిల్ ప్రకటించేయడం.. ఆ తర్వాత వెనువెంటనే పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు, టీజర్, ట్రైలర్, థియరిటికల్ ట్రైలర్, పాటలు, లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ ఇలా రిలీజ్ చేస్తూ సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకుల మదిలో ఆ సినిమా నానుతూనే ఉండేలా చేస్తారు.

ఇక పాటల సంగతికి వస్తే ఈ మధ్య ర్యాప్, జాజ్ వంటి వెస్టర్న్ మ్యూజిక్ కంటే మట్టిలో మాణిక్యాల వంటి నేటివ్ పాటలకే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే చాలా మంది దర్శకులు అచ్చతెలుగు పాటలు, ప్రాంతీయ యాసలతో సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అలా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన వెంటనే రికార్డ్స్ సృష్టించిన పాటే దసరా సినిమాలోని చమ్కీల అంగిలేసి సాంగ్.
చమ్కీల అంగిలేసి పాట ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్ ఇలా ఎక్కడ చూసినా ఈ పాటే. ఏ ఫంక్షన్ కు వెళ్లినా ఈ పాటే. సాధారణ ప్రేక్షకులే కాదు ఈ పాటకు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. అందుకే తమ బిజీ షెడ్యూల్ లో దొరికిన కాస్త టైంలో ఈ పాట వింటూ అలా ఓ స్టెప్పేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇక దసరా సినిమాలో నటించిన నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ లు ఇప్పటికే ప్రమోషన్స్ లో కూడా ఈ పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ క్రేజీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కీర్తి సురేశ్ తల్లి, అలనాటి తార మేనక కూడా ఈ పాటకు కాలు కదిపారు.
తన కూతురిలాగే మేనక ఈ పాటకు అదిరిపోయేలా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె ట్రెండ్‌కు అనుగుణంగానే దీనిని క్రియేట్ చేసినట్లు క్యాప్షన్ పెట్టారు. మరోవైపు, కీర్తి సోదరి భర్త సైతం ఈ పాటకు డ్యాన్స్ చేశాడు. మేనకతో కలిసి అతడు ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కీర్తి ఆనందం వ్యక్తం చేశారు.