ముందు నువ్వు తెలుగు నేర్చుకో అంటూ మహేష్ బాబు కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన దగ్గుపాటి రానా!

- Advertisement -

మన టాలీవుడ్ లో హీరోలందరూ మంచి స్నేహం గా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఉంటారు. కానీ కొంతమంది హీరోల మధ్య మాత్రం మొదటి నుండి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. వారిలో ముఖ్యంగా మనం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దగ్గుపాటి రానా గురించి మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరి మధ్య మొదటి నుండి మంచి వాతావరణం అయితే లేదు. గతం లో రానా హీరో కాకముందు VFX డిజైనర్ గా పని చేసేవాడు. పలు సినిమాలకు కూడా వర్క్ చేసాడు.

దగ్గుపాటి రానా
దగ్గుపాటి రానా

అలాంటి సినిమాలలో ఒకటి ‘సైనికుడు’. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబు చేసిన సినిమా ఇది. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. గ్రాఫిక్స్ వర్క్ పై కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. దీనికి మొత్తం బాధ్యత రానానే అంటూ మహేష్ వేలెత్తి చూపించాడట. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది.

లీడర్ సినిమా విడుదల సమయం లో మహేష్ బాబు మాట్లాడుతూ ‘లీడర్ సినిమాని చూసాను, బాగానే ఉంది కానీ, శేఖర్ కమ్ముల ఇంకా మంచిగా తియ్యగలడు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి రానా రిప్లై ఇస్తూ ‘మీలాంటి నటుడు ఉంటే మంచి ఔట్పుట్ వస్తుంది సార్’ అంటూ వెటకారంగా కౌంటర్ ఇచ్చాడు. అప్పట్లో మహేష్ బాబు టాలీవుడ్ లో డబ్బింగ్ సిస్టం ని తీసేసి సింక్ సౌండ్ టెక్నాలజీ ని నేర్చుకోవాలి అంటూ ఒక ట్వీట్ వేసాడు.

- Advertisement -

అప్పుడు రానా దానికి కౌంటర్ ఇస్తూ ‘ముందు ఇండస్ట్రీ లో తెలుగు కోచింగ్ సెంటర్స్ ప్రారంభించాలి, చాలామందికి తెలుగు రాదు ఇక్కడ’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. మహేష్ బాబు కి తెలుగు చదవడం, రాయడం రాదు, కేవలం మాట్లాడడం మాత్రమే వచ్చు, ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే పలు సందర్భాలలో తెలిపాడు. అది తెలుసు కాబట్టే రానా కావాలని మహేష్ కి కాలే విధంగా అలా ట్వీట్ వేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్లిద్దరి మధ్య ట్విట్టర్ గొడవలు చాలానే ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here