‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీలీల కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘ధమాకా’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల భామ. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్‌లతో సినిమాలతో యమ జోష్‌లో ఉంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల ఒకేసారి స్టార్ హీరోలతో లైన్‌అప్ ప్లాన్ చేసింది. దీంతో టాలీవుడ్ శ్రీలీలకు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం 12 సినిమాలను శ్రీలీల ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అటు శ్రీలీల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. చూడటానికి క్యూట్‌గా ఉండటంతో ఈ ముద్దుగుమ్మకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఏదైనా ఫోటో పెట్టిన వెంటనే క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. శ్రీ లీల చిన్నప్పటినుంచి చాలా కూల్‌గా, పద్ధతిగా ఉంటుందట. అయితే తనకు చిల్ అవ్వటం చాలా ఇష్టమని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఫ్రెండ్స్ పార్టీలు తిరగాలి అని ఆశ ఎక్కువ ఉండేదట. అలా తనకున్న ఇష్టం కారణంగా వాళ్ళ అమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసిందట. శ్రీలీలకు ఏం కావాలన్నా వాళ్ల అమ్మే దగ్గరుండి మరీ చూసుకుంటుందట. ఇక సినిమా షూట్స్ లేకపోయినా తన చదువులో ఏమాత్రం తీరిక దొరికినా వెంటనే తనను వంటగదిలోకి పంపిస్తుందట. ఇంటిపని, వంటపని నేర్చుకోవాలని చెబుతూ ఉండేదట. తన పని తాను చేసుకునే విధంగా ఆమె తన కూతురుకి ట్రైన్ చేస్తుందట.

అయితే శ్రీలీలకు మాత్రం మొదటి నుంచి కిచెన్ అన్నా, ఇంటి పనులన్న పెద్దగా ఇష్టం చూపించేది కాదట. దీంతో వంటింట్లోకి వెళ్లనని మారాం చేస్తుంటే బలవంతంగా పంపించేదట. అలా బలవంతంగా శ్రీలీల కి వంటనేర్పిందట. అలా తనకి ఇష్టం లేకపోయిన అమ్మ కోసం ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుందట ఈ అందాల భామ. ఎవరి పనులు వారే చేసుకోవాలని, వాటికోసం వేరే వ్యక్తిపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో వాళ్ల అమ్మ అలా చేయించేదట.