సోషల్ మీడియా ఎప్పుడూ ట్రెండ్ అయ్యే పేరు ఏదైనా ఉందా అంటే అది సమంత పేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగ చైతన్య తో పెళ్లి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఈమె గురించి సోషల్ మీడియా ఎదో ఒక వార్త రాకుండా మాత్రం ఉండడం లేదు. ఇక నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత అయితే ఇంకా తారాస్థాయికి చేరుకుంది.

సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియా లో వచ్చే నెగటివ్ కామెంట్స్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మీద బోలెడన్ని రూమర్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సమంత తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ తో రిలేషన్ తో ఉందని. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాతనే నాగచైతన్య ఆమెకి విడాకులు ఇచ్చాడని,ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో రోజూ ప్రచారం అవుతూనే ఉన్నాయి.

అయితే దీనిపై అటు సమంత , ఇటు ప్రీతమ్ అనేక సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా లో ఈ రూమర్స్ ఆగడం లేదు. దీనిపై ప్రీతమ్ రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ మన బాగా దగ్గరైన వాళ్లకు ఏదైనా కష్టం వస్తే క్లోజ్ గా మూవ్ అవ్వడం, వాళ్ళ కష్టాలను తీర్చే విధమైన కార్యక్రమాలు చెయ్యడం సర్వసాధారణం, సమంత విషయం లో నేను చేసింది కూడా అదే, కానీ సోషల్ మీడియా లో నాగ చైతన్య ఫ్యాన్స్ , మరియు నెటిజెన్స్ దానిని వేరే విధంగా అర్థం చేసుకొని మా మధ్య లేని పోనీ సంబంధాలను అంటగడుతున్నారు.
సమంతకి నాకు అక్క తమ్ముడి సంబంధం మాత్రమే ఉంది. నాగ చైతన్య కి కూడా మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ తెలుసు, నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నావాడు. నేను చాలా అగ్రెసివ్ పర్సన్, నాపైన ఏదైనా రూమర్స్ వస్తే తట్టుకోలేను. ఒక చెంప మీద కొడితే పది సార్లు చెంప పగలగొట్టే రకం నేను, నాపై వస్తున్నా ఈ రూమర్స్ పై చాలా బలంగా స్పందించాలని ఉంటుంది, కానీ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందని కొంతమంది సన్నిహితులు చెప్పడం తో , మనసులోనే బాధని దాచుకొని కుమిలిపోవాల్సి వస్తుంది, మానసిక వేదనని అనుభవిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రీతమ్.
