Colors Swathi : విడాకుల గురించి తలతిక్క సమాధానం చెప్పిన కలర్స్ స్వాతి.. తలపట్టుకున్న రిపోర్టర్లు..

- Advertisement -

Colors Swathi : ‘కలర్స్‌’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించి, ఆ తర్వాత నటిగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు స్వాతి. శ్రీకాంత్‌ నగోటి దర్శకత్వంలో నవీన్‌ చంద్రతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. శ్రేయా నవిలే, మంజుల, హర్ష తదితరులు నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు స్వాతి సమాధానం ఇచ్చారు. అంతేకాదు, ‘స్వాతి విడాకులు తీసుకున్నారు’ అంటూ వస్తున్న వార్తలపై ఓ విలేకరి ప్రశ్నించగా, తన స్పందన తెలియజేశారు.

Colors Swathi
Colors Swathi

‘‘విడాకులకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘నేను ఇవ్వ’.. ఎందుకంటే, కలర్స్‌ చేసినప్పుడు నాకు 16ఏళ్లు. అప్పుడు సోషల్‌ మీడియా లేదు. లేకపోతే ఫుట్‌బాల్‌ ఆడేసేవాళ్లు. ఇప్పుడున్న నటీనటులు వాటిని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారో. నాకంటూ కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయి. దానికి కట్టుబడి విడాకులపై నేను స్పందించను. ఇది సినిమా ఈవెంట్‌, ఇక్కడ ఆ ప్రశ్న అప్రస్తుతం’’ అంటూ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.

కలర్స్ స్వాతి

‘‘నవీన్‌, నేనూ కలిసి ‘త్రిపుర’ చేశాం. ఆ తర్వాత మేమిద్దరం రెండు, మూడేళ్లు టచ్‌లోనే లేము. కనీసం పండగలకు శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేదు. ‘భానుమతి రామకృష్ణ’ ప్రోమో పంపించి, సినిమా కూడా చూడమని చెప్పాడు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ‘నాకు స్పెషల్‌గా పంపడానికి కారణం ఏంటి’ అని అడిగితే, ‘అదే థీమ్‌తో మళ్లీ చేద్దామనుకుంటున్నాం. నువ్వు నటిస్తావా’ అని చెప్పాడు. ఆ తర్వాత వచ్చి కథ వింటే నాకూ నచ్చింది. నవీన్‌తో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంది’’ అంటూ హంగామా చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here