Color Swathi : సెలబ్రిటీస్ జీవితాలను తలక్రిందులు చేసే వెబ్ సైట్స్ కొన్ని ఉన్నాయి. కాంట్రవర్సీలకు దూరంగా ఉన్న వాళ్లపై కూడా నోటికి వచ్చినట్టు రాతలు రాసి వాళ్ళ కుటుంబం లో కలతలు రేపారు. ఈ వెబ్ సైట్స్ రూమర్స్ వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది సెలెబ్రిటీలు కూడా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సైట్స్ లో ఒకటి గ్రేట్ ఆంధ్ర. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నడిపే వెబ్ సైట్ ని తిట్టని సెలబ్రిటీ అంటూ ఎవ్వరూ మిగిలి లేరు.
చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా పబ్లిక్ గా ఈ వెబ్ సైట్ ని తిట్టారు. విజయ్ దేవరకొండ అయితే నీరు ఒక వీడియో చేసి బండ బూతులు తిట్టాడు. అప్పట్లో ఆయనకీ సపోర్టుగా టాలీవుడ్ మొత్తం కదిలింది. ఇప్పుడు రీసెంట్ గా కలర్స్ స్వాతి కూడా ఈ వెబ్ సైట్ పై విరుచుకుపడింది.
ఈమె హీరోయిన్ గా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమా రీసెంట్ గానే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కలర్స్ స్వాతి గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ పై చాలా తీవ్ర స్థాయి లో విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ ‘ ఆ గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ నాపై రాసిన రాతలు చూసి నేను మానసికంగా ఎంతో కృంగిపోయాను, నా జీవితం చాలా డిస్టర్బ్ అయ్యింది.
వాళ్ళు రాసే ఆ పిచ్చి రాతలు చూసి నాకు పిచ్చెక్కిపోతుండడంతో 5 ఏళ్ళ నుండి ఆ సైట్ ఓపెన్ చెయ్యడమే మానేసాను. అసలు నన్ను వాళ్ళు కనీసం మనిషిలాగ కూడా గుర్తించలేదు. డివోర్స్ గురించి ప్రశ్నలు అడిగినందుకు సంతోషం సురేష్ గారిని నేను తిట్టాను అంట. ఆ రోజు మీరంతా వచ్చారు, ఎవరైనా సురేష్ గారు ఫీల్ అయ్యినట్టు చూసారా?, చాలా పాజిటివ్ వాతావరణం ఉంది ఆరోజు’ అంటూ కలర్స్ స్వాతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.