Kiara Advani : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మరో క్యూట్ జంట నేడు పెళ్లి పీటలు ఎక్కి ఒక్కటైంది.. ప్రముఖ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా గత కొంత కాలం నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉంటున్నారు..ఈ విషయం బాలీవుడ్ మొత్తం కోడై కూస్తున్నా కానీ, ఎక్కడో ఇది చిన్న రూమర్ అనే భావన అభిమానుల్లో ఉండేది..కానీ అది నిజమే అని గత కొద్ది రోజుల క్రితమే ఖారారు అయ్యింది.నేడు రాజస్థాన్ లోని జైస్మర్లేరోని ప్యాలస్ లో అతిరథ మహారథుల సమక్షం లో అంగరంగ వైభోగం గా జరిగింది.

ఈ సందర్భంగా కియారా అద్వానీ తన పెళ్ళికి సంబంధించిన రెండు ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది.అందమైన ప్రేమ పక్షులు లాగ ఉన్న వీళ్ళిద్దరిని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపిస్తున్న ఈ జంట పెళ్లి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీముందు ఉంచబోతున్నాము.

ఇక అసలు విషయానికి జైసల్మీర్లోని ప్యాలస్ లో ఒక్క రోజు వివాహం వేడుకలు జరుపుకోవడానికి రెండు కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందట.అంటే మూడు రోజులకు కలిపి ఆరు కోట్ల రూపాయిల ఖర్చు అన్నమాట, అంతే కాకుండా ఈ వివాహ మహోత్సవానికి కియారా అద్వానీ వేసుకున్న దుస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఈ దుస్తులను కేవలం ఈ వివాహ మోహోత్సవం కోసమే చేయించారట.

బంగారం మరియు వెండి పూత తో చేయించిన ఈ దుస్తుల విలువ సుమారుగా 50 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ లోనే కాదు ఇండియా లోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి నిలిచిపోయిందని చెప్తున్నారు.. ఇక పెళ్లి తర్వాత ఈ జంట నివసించబోయ్యే ఇల్లు కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది.. జుహా ప్రాంతం లో ఇటీవలే ఈ జంట 70 కోట్ల రూపాయిలు పెట్టి 3500 స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఒక బంగ్లాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.