Samantha – Chitti Babu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాత చిట్టిబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద మండిపడ్డారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కి చిట్టి బాబు కౌంటర్ ఇచ్చారు.

చిట్టిబాబు సమంతను టార్గెట్ చేస్తూ సినిమా ప్రమోషన్ల విషయంలో అనారోగ్యంతో బాధపడుతున్నాను అనే సింపతి క్రియేట్ చేసి ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరని అన్న మాటలు అప్పట్లో సెన్సేషనల్ అయ్యాయి. తాజాగా సమంత పై మరోసారి నిర్మాత చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సమంత స్టార్ డం అంతా ఎప్పుడో పోయింది తను సినీ ఇండస్ట్రీలో నిలబడే ఆఫర్స్ అన్నింటినీ రిజెక్ట్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె గ్లామర్ కూడా పోయింది. శాకుంతలం సినిమాకి సమంతను ఎందుకు తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలాంటి పాత్రను సమంతా చేయగలదా అంటూ నిర్మాత చిట్టిబాబు ఆమెపై నెగిటివ్ ప్రచారం చేయడంతో.. ఆ వ్యాఖ్యలను తిప్పుకొడుతూ సమంత పరోక్షంగా స్పందించారు.

చిట్టిబాబు మీద ఒక సెటైరికల్ పోస్టును సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిట్టి బాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జనాలకు చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్ లో సర్చ్ చేస్తే టెస్టోస్టిరాన్ అధికం కావడం వల్ల అని ఒక పోస్ట్ షేర్ చేసింది.
సమంత తాజాగా సమంత చేసిన పోస్ట్ పై నిర్మాత చిట్టిబాబు స్పందించారు. సమంత నువ్వు ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను కూడా వారి పేరు చెప్పడం లేదు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నా మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేది అని ఆయన అన్నారు.
నేను నోరు విప్పితే పరువు పోతుంది అని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో చిట్టి బాబు ఇలా ఈ విధంగా స్పందించారు. ఈ కౌంటర్స్ కి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సమంత అభిమానులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.