Chiru Leaks .. వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్

- Advertisement -

Chiru Leaks : మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్​గా ఉంటున్న విషయం తెలిసిందే. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్​కు సంబంధించి ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను తానే లీక్ చేస్తున్నారు కూడా. అందుకే చిరు లీక్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా కూడా మెగాస్టార్ కొన్ని లీక్స్ పోస్టు చేశారు. అయితే ఈసారి చిరంజీవి లీక్ చేసింది సినిమా గురించి కాదండోయ్. తన ఫ్యామిలోలో జరుగుతున్న ఓ అందమైన ఈవెంట్ గురించి. మరి ఆ ఈవెంట్ ఏంటంటే..?

చిరంజీవి తమ్ముడు నాగబాబు గురించి అందరికీ సుపరిచతమే. నాగబాబు కుమారుడు.. మెగాప్రిన్స్ వరుణ్ కొణిదెల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాటిల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. అయితే మరికొన్ని రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ జంట తమ పెళ్లి పనులు కూడా షురూ చేసింది. ఇద్దరూ కలిసి ముంబయిలోని మనీష్ మల్హోత్రాను కలిసి తమ పెళ్లి దుస్తులు డిజైన్ చేయాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ జంట విహార యాత్రకు విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చింది.

Chiru Leaks
Chiru Leaks

ఇక వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన ఈ జంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ ఇంట్లో ఈ వేడుకలు జరిగినట్లు తాజాగా చిరంజీవి షేర్ చేసిన ఫొటోలు చూస్తే తెలుస్తోంది. గత రాత్రి ఎంతో సంతోషకరమైన రాత్రి.. నా ఫ్యామిలీ అంతా ఒకచోట కలిసి నా కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాం. ఇది ఎంతో సంతోషకరంగా ఉందంటూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. ఆ వేడుకకు సంబంధించి ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో వరుణ్-లావణ్య చాలా సింపుల్​గా కనిపించినా.. భలే అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here