Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం తన గురించి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు సంబంధిత విషయాలను తెలియజేస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ సంగతేంటో చూద్దాం. శ్రీజ ఒకానొక సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి సంచలనం సృష్టించింది. ఓ కూతురు పుట్టిన తర్వాత అతడితో మనస్పర్థలు రావడంతో విడిపోయి మెగా ఇంటికి వచ్చేసింది. తన కూతురు బాధ చూడలేక హీరో కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో పెళ్లి చాలా గ్రాండ్‌గా చేశారు చిరంజీవి.

వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. కానీ, కొన్నాళ్లకే మళ్లీ వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడటంతో శ్రీజ తన కూతుర్లతో కల్యాణ్ దేవ్ కు కూడా దూరంగా వెళ్లిపోయింది. కల్యాణ్ దేవ్, శ్రీజ కూడా విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అఫీషియల్ గా మాత్రం ప్రకటించలేదు. అయితే కల్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నాడు. ఇక శ్రీజ కూడా తన ఫ్యామిలీతో, కూతుర్లతో ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోలను నెట్టింట్లో పెడుతుంది.
తాజాగా, శ్రీజ శుభవార్తను ప్రకటించింది. తను కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాతో ఆసక్తికర పోస్ట్ పంచుకుంది. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ క్యాప్షన్లో రాసుకొచ్చింది. శ్రీజ హైదరాబాద్‌లో అనంత స్టూడియో పేరుతో ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను మొదలు పెట్టింది. ఈ బిజినెస్ ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పాశెట్టి హాజరై సందడి చేశారు. అయితే ఇందులో శరీరానికి ప్రశాంతత కలిగించడానికి జిమ్, యోగా ఇతరత్రా కార్యక్రమాలు ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన మెగాభిమానులు శ్రీజను పొగిడేస్తున్నారు.