తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఆదర్శంగా నిలిచే రేంజ్ కి ఎదిగాడు. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం కలుగుతుంది చెప్పండి. కెరీర్ లో ప్రారంభం లో వచ్చిన ప్రతీ అవకాశం ని వాడుకున్నాడు.
చిన్న చిన్న పాత్రలు వచ్చేవి, అవి కూడా చేసేవాడు. అలాగే హీరో గా రెండు మూడు హిట్ సినిమాలు వచ్చినా కూడా, కొత్త వాడు కాబట్టి విలన్ రోల్స్ వేయించేవాళ్ళు అప్పట్లో. అలా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి ‘ఖైదీ’ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమా నుండి నేటి వరకు ఆయన నెంబర్ 1 హీరో గా కొనసాగుతూనే ఉన్నాడు. 70 ఏళ్ళ వయస్సు కి దగ్గరగా వచ్చినా కూడా, ఇప్పటికీ సోలో వంద కోట్ల షేర్ సినిమాలను కొడుతున్నాడు.
ఇంతటి సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు. కానీ అనధికారికంగా ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఉదాహరణకి ఇంద్ర సినిమాకి అప్పట్లో 50 శాతం కి పైగా సినిమాకి చిరంజీవి దర్శకత్వం వహించాడట. ఆ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కి ముందు , ఈ సినిమా తర్వాత కూడా అలాగే కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
అలాగే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిన ఏకైక చిత్రం ‘లంకేశ్వరుడు’ అట. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మూడు పాటలు డ్యాన్స్ మాస్టర్ మరియు దాసరి నారాయణ రావు లేకుండా తీసారట. ఈ మూడు పాటలకు చిరంజీవి కొరియోగ్రఫీ చేసాడని టాక్. ముఖ్యంగా ’16 ఏళ్ళ వయస్సు’ పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకి కొరియోగ్రాఫేర్ మన మెగాస్టార్ చిరంజీవి. అదే చిత్రం లో మరో రెండు పాటలకు కూడా ఆయనే కొరియోగ్రఫీ చేసాడు.