Chiraneejvi : తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సన్మానానికి నాంది పలికింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని అరుదైన వేడుకను తెలంగాణ ప్రభుత్వం చేసింది. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభను నిర్వహించింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయా రంగాల్లో ఎన్నో సేవలు చేసిన ప్రముఖులకు పద్మవిభూషణ్ అవార్డు తో సత్కరించింది.
ఇక తెలుగులో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును అందించి గౌరవించింది. దీంతో హైదరాబాద్లోనే శిల్పకళా వేదికలో నేడు వారికి తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసింది. ఈ సన్మాన సభకు తెలంగాణ రాజకీయ నేతలతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..‘‘పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను కానీ ఆ సంతోషం పద్మ విభూషణ్ వచ్చినప్పుడు నాకు లేదు. ఆ తర్వాత పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు కాను ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు ఎంతో సంతోషం కలిగింది.
పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే మొట్టమొదటిసారి.. ఈ అవార్డు రావడం కన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సత్కరించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని నిర్ణయం శుభసూచకం కళాకారులు గౌరవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది” అని చిరంజీవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. చిరు స్పీచ్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇందుకే నువ్వు మెగాస్టార్ అయింది అని తెగ పొడిగేస్తున్నారు.