Anupama Parameshwaran : నాకు ఆ దర్శకుడికి మధ్య మంచి ర్యాపో ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్

- Advertisement -

Anupama Parameshwaran : మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ‘ఈగల్’. ఈ చిత్రాన్ని కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Anupama Parameshwaran
Anupama Parameshwaran

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. నిజానికి ఈమూవీ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో వరుస సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ మూవీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమాలోని కొంతమంది నటీనటులతో కలిసి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిన్న పార్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అనేసింది. దీంతో వెంటనే రవితేజ రియాక్ట్ అవుతూ.. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా అంటూ ఓ వెరైటీగా ఎక్స్‏ప్రెషన్ ఇచ్చాడు. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదాన్ని వాడకూడదు. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు. ఆ తర్వాత అనుపమ మాట్లాడుతూ.. నేను అతనితో కలిసి నాలుగో సినిమా చేస్తున్నాను.

- Advertisement -

మా మధ్య ర్యాపో ఉండి అలా పిలుస్తున్నాను అని చెప్పడంతో.. అయితే మేము మూడు సినిమాలు మీతో చేసి ఆపేస్తాం అంటూ కౌంటరిచ్చాడు. ఇక ఆ తర్వాత నవదీప్ మాట్లాడుతూ.. పాపం కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నువ్వు అన్నయ్య అంటున్నావని అని అన్నాడు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే నెగిటివ్ పాత్రలో వినయ్ రాయ్ నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుడంగా.. డవ్ జంద్ సంగీతం అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here