Chiranjeevi – Anchor Suma : మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.

అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టేజ్ పైకి వచ్చిన చిరు సుమ పై పంచులు వేశారు. వచ్చి రాగానే సుమ ఒక్క నిమిషం ఆగు సురేఖకు ఫోన్ చేసి ఒకవిషయం అడగాలి అంటూ ఫోన్ చేస్తాడు. ‘సురేఖ యాష్ కలర్ కోటు, బ్లాక్ ప్యాంట్ పోయిందని అన్నావుగా అది ఎక్కడికి పోలేదు. దొరికేసింది. భోజనానికి సుమ మన ఇంటికి వచ్చినప్పుడు చేతి వాటం చూపించింది. ఇచ్చేస్తుందిలే అంటూ ఫోన్ పెట్టేస్తాడు. మన కష్టజీతం ఎక్కడికి పోదు. మన దగ్గరికే వస్తుంది. సుమ ఇచ్చేస్తుందిలే’ అంటూ సరదాగా మాట్లాడి ఈవెంట్ లోని అందర్నీ నవ్వించారు. ఇక అంతే సుమకు ఆ మాటలు వినగానే నోట మాటలు రాలేదు.
ముఖంలో రంగులు మారాయి. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో చిరంజీవి, విజయ్ దేవరకొండతో ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఆ సందర్బంగా చిరు తన జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, తన ఇష్టమైన వాటి గురించి వివరించాడు.