Chiranjeevi : ‘కల్కి’ దర్శకుడితో సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాని రీమేక్ చెయ్యబోతున్న చిరంజీవి!

- Advertisement -

Chiranjeevi : కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన దర్శకుడు నాగ అశ్విన్. మహానటి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, మొదటి సినిమాతోనే క్లాసిక్ అందించాడు అనే పేరు తెచ్చుకున్న నాగ అశ్విన్, ఇప్పుడు కల్కి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల మార్కుని దాటేస్తుందని అంటున్నారు మేకర్స్. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ ,తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపేస్తుంది. ఈ చిత్రం విజయం పట్ల టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ సెలబ్రిటీస్ అందరూ మేకర్స్ కి కృతఙ్ఞతలు తెలియచేసారు. వారిలో అందరికంటే ముందుగా మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియచేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi
Chiranjeevi

గతం లో కూడా నాగ అశ్విన్ మొదటి సినిమా మహానటి కి చిరంజీవి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మూవీ టీం కి అభినందులు తెలిచేసాడు. ఆ సమయం లో చిరంజీవి తన మనసులోని కోరికని బయటపెడుతూ, నాకు పాతాళ భైరవి వంటి జానపద చిత్రాలు చెయ్యడం అంటే చాలా ఇష్టం, నాకోసం ఆ తరహా కథని సిద్ధం చెయ్యి అంటూ అడిగాడు. అయితే లేటెస్ట్ గా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఏమిటంటే కల్కి సిరీస్ తర్వాత నాగ అశ్విన్ చెయ్యబోయే చిత్రం మెగాస్టార్ చిరంజీవి తోనేనట. మరి ఆయన చిరంజీవి కోరికకు తగ్గట్టుగా పాతాళ భైరవి తరహా కథతో సినిమా తీస్తాడా?, లేకపోతే వేరే ఏదైనా జానర్ లో తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Nag Ashwin to direct Megastar?

- Advertisement -

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22 వ తారీఖున బయటకు రానుంది. ఇకపోతే నాగ అశ్విన్ ప్రస్తుతం కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన కల్కి 2 ని ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 60 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన భాగం కి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రెండవ భాగాన్ని విడుదక చేసే యోచనలో ఉన్నారట మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here