Chiranjeevi : ఆ డైరెక్టర్లకు చిరంజీవి స్వీట్ వార్నింగ్

- Advertisement -

Chiranjeevi : వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లోనూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ కొందరు డైరెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే..?

Chiranjeevi
Chiranjeevi

నిర్మాతల డబ్బును వృధాగా ఖర్చు చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్‌వర్క్‌లోనే పూర్తి చేసేయాలని చిరంజీవి దర్శకులకు సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చెప్పారు. 

 ‘‘వాల్తేరు వీరయ్య’ విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు మాటలు విద్దాం. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశా. కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిది. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది. మన మీదతో జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం తెలియాలి. బాబీ చెప్పిన కథ  అందరికీ నచ్చింది. నువ్వు స్క్రిప్ట్‌ పూర్తి చేసిన ప్రతిసారీ నాకు చెప్పు. నచ్చితే ముందుకు వెళ్దాం. లేకపోతే మళ్లీ మార్పులు చేసుకుని రావాలి’ అన్నప్పుడల్లా ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. ఇలా చెబితే, ఎవరికైనా అహం అడ్డువస్తుంది. ఇంతకన్నా బాగా ఉంటుందా? అని సంతృప్తిపడిపోతారు. అలా జరిగితే, దాంతో స్థాపితం అయిపోయినట్లే. కానీ, బాబీ అలా చేయకుండా ప్రతి సీన్‌ను సంపూర్ణం అయ్యేలా మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. నిజంగా ఇదొక కేస్‌ స్టడీగా యువ దర్శకులు చూడాలి’’

- Advertisement -
Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

‘‘సినిమాలో అదనంగా సీన్స్‌ ఉంటే, ఆ పేపర్‌లను చింపేసి పారేయమని చెప్పేవాడిని. అనవసరంగా సీన్లు తీసి, నిర్మాతల డబ్బు, సమయాన్ని బుట్టదాఖలు చేయొద్దని చెప్పా. ఇలా చెబితే వినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. ‘అరగంట సినిమా ఎడిటింగ్‌ రూమ్‌లో పక్కన పడేశాం’ అనే మాటలు వింటూనే ఉన్నాం. మా సినిమా ఏడున్నర నిమిషాలు.. మహా అయితే, పది నిమిషాలు పక్కన పెట్టాం. యాక్షన్‌ సన్నివేశాల్లో కాస్త ఎక్కువ తీశాం తప్ప, నిర్మాతలకు నయా పైసా వృథా కాలేదు’’

‘‘నేను అనే మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్‌ అవుతారేమో, ‘సినిమా అంటే సూపర్‌ డూపర్‌ హిట్ ఇవ్వడం కాదు.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో పూర్తి చేసి ఇవ్వాలి. అదే మొదటి సక్సెస్‌. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే, కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. ప్రతి వాళ్లు ఆలోచించాలి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు. దీన్ని మీడియా వేరే వాళ్లకు, వాటికి ఆపాదించవచ్చు. సత్తా ఉన్నా దర్శకులు ఒక సినిమాకు ఎక్కువ సన్నివేశాలు తీస్తే, దాన్ని పార్ట్‌-2 మలుచుకోగలుగుతున్నారు. అలా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘బాహుబలి’ చిత్రాలకు కుదిరింది. ఇవన్నీ మాట్లాడి కొంచెం క్లాస్‌ ఎక్కువ తీసుకున్నాననుకుంటా. ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే మళ్లీ సినిమాలు చేస్తారు. నా తమ్ముడు రవితేజ లేకపోయుంటే, ఈ సినిమా సెకండాఫ్‌లో ఇంత అందం వచ్చేది కాదు. ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పక్కర్లేదు. మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే థ్యాంక్స్‌ చెబుతున్నారు.’’ అని చిరంజీవి అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here