Chiranjeevi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, కెరీర్ ప్రారంభం లో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకున్న సంగతి తెలిసిందే..ఆయన జీవితం ప్రతీ ఒక్కరికి ఒక పాఠం లాంటిది.ఆయనని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు, ఇతర రంగాలలో కూడా పైకి రావాలంటే చిరంజీవి ని ఆదర్శంగా తీసుకోవాలి.

ఆ రేంజ్ రోల్ మోడల్ గా నిలిచాడు మన మెగాస్టార్. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్త్వం కూడా చిరంజీవి ని చూసి నేర్చుకోవాలి. తనతో పాటు పనిచేసే ప్రతీ ఆర్టిస్టు తో చిన్న పెద్దా అని తేడా లేకుండా ఎంతో స్నేహభావం తో మెలిగిపోతాడు చిరు. అందుకే ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళందరూ చిరంజీవి ని అంతలా గౌరవిస్తారు. ఇటీవలే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ శ్రీ లక్ష్మి చిరంజీవి గురించి చెప్పిన కొన్ని గొప్ప మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే ఆరోజుల్లో చిరంజీవి తో కలిసి శ్రీ లక్ష్మి విజేత అనే సినిమా చేసింది. ఇందులో చిరంజీవి కి వదినగా ఆమె నటించింది. ఈ సినిమాలో ఒక్క సన్నివేశం లో శ్రీ లక్ష్మి తెగిపోయిన తన చెప్పులను చిరంజీవి చేతికి ఇచ్చి కుట్టించుకొని రమ్మంటుంది. ఆ సమయం లో అభిమానుల నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో శ్రీ లక్ష్మి చెప్తూ ‘చిరంజీవి చేతికి చెప్పులు ఇచ్చి కుట్టించుకొని రమ్మనడం ఆరోజుల్లో పెను దుమారమే రేపింది. ఆయన అభిమానుల నుండి నాకు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. మా ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు కూడా చేసేవాళ్ళు. వాళ్ళ తాకిడిని తట్టుకోలేకపొయ్యేదానిని, కానీ చిరంజీవి గారు మా అందరితో ఎంతో స్నేహం గా ఉండేవాడు. ఇప్పుడు ఉన్నట్టుగా ఆరోజుల్లో కార్వాన్ లాంటివి లేవు, బ్రేక్ సమయం లో అందరం ఒకే చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం’ అంటూ శ్రీలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడింది.