మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆరాధ్య దైవం. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూలెస్ట్ హీరో ఎవరు అని ఎవరిని అడిగానే చెప్పేది ఆయన పేరే అంతటి కూలెస్ట్ హీరో స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణంగా చిరంజీవికి కోపం చాలా ఎక్కువ అయితే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కోపం చాలా తగ్గిపోయిందట . కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న కోపం ఇప్పుడు లేదట. మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వారికి పెళ్లిళ్లు చేసిన తరువాత..భర్తలు, మనవరాలు వచ్చిన తర్వాత ఇంకా ఆ కోపం మొత్తమే పోయిందట. అయితే చిరంజీవి తనతో వర్క్ చేసే హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సరదా సరదాగా మూవ్ అవుతూనే లిమిట్స్ దాటరు. కానీ ఓ హీరోయిన్ పై మాత్రం చిరంజీవి ఫుల్ ఫైర్ అయిపోయారట.

ఇన్నేళ్ల తన కెరీర్ లో చిరంజీవి అరచి.. కసిరిన ఏకైక హీరోయిన్ ఆమెనట. తాను మరెవరో కాదు సమీరా రెడ్డి. చిరు, సమీరా రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా జై చిరంజీవ . 2006లో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నమోదు చేసుకుంది . అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి చిరంజీవితో సమానంగా ఆడి పాడింది . ‘మహ ముద్దెచ్చేస్తున్నావోయ్’ అనే పాటలో చిరంజీవి కంటే బాగా స్టెప్పులేసింది. ఎంతలా అంటే చిరంజీవి కూడా అమ్మడు డాన్స్ స్టెప్స్ కి ఫిదా అయిపోయాడట. ఈ క్రమంలోనే చిరంజీవి సమీరా పై సరదాగా కోపడ్డారట. ‘నువ్వు నాకన్నా స్టెప్స్ బాగేస్తున్నావ్ ..నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకొను’ అంటూ సరదాగా కోప్పడ్డారట. ఈ విషయం అప్పట్లో చాలా వైరల్ అయింది.
