‘భోళా శంకర్’ 3 రోజుల వసూళ్లు.. ప్లాన్ చేసుకొని తీసిన ఇలాంటి డిజాస్టర్ మళ్ళీ రాదేమో!

- Advertisement -

‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా 8 ఏళ్ళ క్రితం వచ్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ అవ్వడం, దానికి తోడు కెరీర్ వరస్ట్ ట్రాక్ రికార్డు ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ అవ్వడం కారణంగా ఈ చిత్రానికి ఈ స్థాయి నెగటివ్ టాక్ వచ్చిందని చెప్తున్నారు.

భోళా శంకర్
భోళా శంకర్

సోషల్ మీడియా ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఈ సినిమా మీద ఎలాంటి నెగటివిటీ ఉందో అర్థం అవుతుంది. ఆ నెగటివిటీ చూస్తే చిరంజీవి మీద ఇతర హీరోల అభిమానులకు ఎందుకు ఇంత పగ అనేది సామాన్యులకు అంతు చిక్కని ప్రశ్న లాగ అనిపిస్తాది. అయితే ఈ చిత్రం మొదటి మూడు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన ఆ డిజాస్టర్ టాక్ కి ఇది డీసెంట్ స్థాయి వసూళ్లే. కానీ ఎంత పెద్ద మెగాస్టార్ అయినా, ఒక చెత్త కంటెంట్ కి కలెక్షన్స్ ని రప్పించడం చాలా కష్టం తో కూడుకున్న పని. అందుకే రెండవ రోజు మూడు కోట్ల 13 లక్షల రూపాయిలు, మూడవ రోజు మూడు కోట్ల 15 లక్షల రూపాయిల వసూళ్లు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం లో 6 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో మూడు కోట్ల 7 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 80 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 12 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 60 లక్షల రూపాయిలు , కృష్ణ జిల్లాలో కోటి 50 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 10 లక్షల రూపాయిలు వచ్చాయి. వీటితో పాటుగా ఓవర్సీస్ లో రెండు కోట్ల 18 లక్షల రూపాయిలు, కర్ణాటక లో కోటి 50 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు కలిపి 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here