Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ ఏ ఇండస్ట్రీ లో కూడా లేరని అంటూ ఉంటారు. అది నిజమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక కమెడియన్ తనదైన మార్కు వేసుకొని జనాలను మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. బ్రహ్మానందం అందులో సిద్ధహస్తుడు. సుమారుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కినా బ్రహ్మానందం గురించి ఏమని చెప్పాలి.

ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే, లేకుంటే థియేటర్స్ కి కదలం అనే రేంజ్ లో జనాలు ఆయన్ని ఆదరించారు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేసే సంఖ్య ఆరోగ్య రీత్యా తగ్గించాడు కానీ మీమ్స్ రూపం లో ఆయన సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందం రీసెంట్ గానే ‘నేను మీ బ్రహ్మానందం’ అనే పుస్తకం ని విడుదల చేసాడు.

ఈ పుస్తకం లో తన సినీ కెరీర్ లో జరిగిన ఎన్నో విషయాలను బ్రహ్మానందం పంచుకున్నాడు. వాటిల్లో తన గురువు మెగాస్టార్ చిరంజీవి తో తన ఎదురైనా ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి గారిని నేను మొట్టమొదటిసారి చంటబ్బాయి సినిమా షూటింగ్ అప్పుడు చూసాను. చిరంజీవి అప్పుడే ఖైదీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరో అయ్యి ఉన్నాడు. చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది అనే వార్త రావడం అందరూ ఆ ప్రాంతానికి గుమ్మి గూడారు. నేను కూడా దూరం నుండి చిరంజీవిని చూస్తూ ఉన్నాను. ఆరోజు ఆయన చార్లీ చాప్లిన్ వేషం లో ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు నవ్వు వచ్చేసింది.

నేను నవ్వడం ని గమనించిన చిరంజీవి గారు కోపం తో నా వైపు చూసాడు. ఇటు రా అని పిలిచి, నెత్తి మీద సరదాగా ఒక దెబ్బ వేసి, ఎందుకు అలా నవ్వుతున్నావ్, ఎవరు ఇతను, ఇతను ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చాలా వింతగా ఉన్నాయి, బయటకి తోసేయండి అనగా జంధ్యాల గారు వచ్చి, ఇతను బ్రహ్మానందం ని ఒక లెక్చరర్, ఇప్పుడు ఆర్టిస్టు అయ్యాడు అని చెప్పగానే చిరంజీవి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.