Chiranjeevi : ఏంటీ… చిరంజీవి ‘భోళా శంకర్’లో ఫ్రీగా నటిస్తున్నాడా.. కారణమిదేనా..

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానుల్లో పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఆయన అలా ఒక్క డైలాగ్ చెప్పి, ఓ స్టెప్ వేస్తే థియేటర్ దద్దరిల్లిపోతది. మరి అలాంటి హైరేంజ్ స్టార్ హీరో ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ భోళా శంకర్ త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఓ బజ్ క్రియేటైంది. ఈ సినిమా కోసం చిరు రెమ్యునరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.

Chiranjeevi :
Chiranjeevi

ఈ సినిమా రిలీజై, లాభాల్లోకి వెళ్తే అందులో చిరంజీవి వాటా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు నటించిన చివరి రెండు సినిమాలు గాడ్‌ఫాదర్, వాల్తేర్ వీరయ్య సూపర్ డూపర్ హిట్స్ కావడంతో భోళా శంకర్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ ధరకు అమ్ముకున్నారు. అటు ఓటీటీ హక్కుల ద్వారా కూడా మేకర్స్ బాగానే వెనుకేసుకున్నట్లు సమాచారం. దీంతో మూవీ లాభాల్లోకి దూసుకెళ్లడం ఖాయం. అందులో చిరంజీవి ఎంత మొత్తం తీసుకుంటాడన్నది చూడాలి.

భోళా శంకర్ మూవీని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మించాయి. మెహర్ రమేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భోళా శంకర్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గురువారం రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు. భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ తెరకెక్కింది. అయితే, మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా మార్పులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు మెహర్ రమేశ్. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here